Connect with us

రామ్ చరణ్ ముద్దుగా పెంచుకుంటున్న ఈ కుక్క పిల్ల రేటు ఎంతో తెలుసా..

Latest Cinema news

రామ్ చరణ్ ముద్దుగా పెంచుకుంటున్న ఈ కుక్క పిల్ల రేటు ఎంతో తెలుసా..

తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమాను తయారు చేస్తోన్న రామ్ చరణ్ గెలుపు పొందిన తొలి సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ఈ తమిళ దర్శకుడుతో సినిమాను తయారు చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

ఈ సినిమా ముందుగా ఈ ఏడాది సమ్మర్‌లో వస్తుందని అన్నారు.  అయితే శంకర్ ఎక్కువగా తన టైమ్‌ను భారతీయుడు2 షూటింగ్ లో గడుపుతూ ఉండగా గేమ్ ఛేంజర్ షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఇక మొన్నటి వరకు ఆగస్టులో విడుదల కానుందని భావించారు. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా అక్టోబర్ 2న వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా షురూ కానుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగాయి.

అది అలా ఉంటే రామ్ చరణ్ ఓ కుక్క పిల్లను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. టాయ్ పూడిల్ అనే బ్రీడ్‌కు చెందిన ఓ కుక్కపిల్లను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన దీనికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటాడు. ఈ కుక్క పిల్లకు రామ్ చరణ్ తన పేరు కలిసి వచ్చేలా రైమ్‌ అనే పేరు పెట్టారు.

ఇక రామ్ చరణ్ ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల ధర విషయానికి వస్తే.. దీని ధర రూ. 35,000, రూ. 70,000 మధ్య ఉంటుంది. ఇక తాజాగా రామ్ చరణ్ తన భార్య, బిడ్డలతో థాయ్ ల్యాండ్ వెళ్లారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

READ ALSO  ఉపాసన తాతగారి బర్తడే పార్టీలో సందడి చేసిన రామ్ చరణ్…..
google news
Continue Reading
To Top