Connect with us

ఉపాసన తాతగారి బర్తడే పార్టీలో సందడి చేసిన రామ్ చరణ్…..

Ram Charan

Latest News

ఉపాసన తాతగారి బర్తడే పార్టీలో సందడి చేసిన రామ్ చరణ్…..

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ విజయం తరువాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మెగాస్టార్ నటవరసగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్ చరణ్. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో RC 15 మూవీ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.

pradap

#image_title

గత కొద్ది కాలంగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ కోసం విదేశీ పర్యటనలు మరియు అవార్డు ఫంక్షన్లతో బాగా బిజీగా ఉన్నాడు.భారీ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ సెలబ్రిటీ కియారా అద్వానీ నటిస్తున్నారు.

pradap

#image_title

ఒకరకంగా చెప్పాలి అంటే ఈ ఇయర్ రామ్ చరణ్ కు బాగా అచ్చొచ్చిందనే చెప్పొచ్చు. పది సంవత్సరాల గా కొణిదెల కుటుంబ సభ్యులు మొత్తం ఎదురుచూస్తున్న శుభవార్తను రామ్ చరణ్ మరియు ఉపాసన అందించారు. మరోపక్క ప్రొఫెషనల్ గా కూడా రామ్ చరణ్ కెరియర్ మంచి స్పీడ్ లో దూసుకుపోతోంది.

అపోలో సంస్థల అధినేత మరియు ఉపాసన తాతయ్య అయిన ప్రతాపరెడ్డి పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా జరిపారు. 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతాపరెడ్డికి కుటుంబ సభ్యులు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్టీకి ఉపాసనతో కలిసి హాజరైన రామ్ చరణ్ ప్రతాపరెడ్డి దంపతులతో తీసుకున్న పిక్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గొప్ప ఆలోచనలు, ధాతృత్వ గుణంతో ఎందరో హృదయాలు గెలిచిన మీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి అని తన మనసులోని భావాలను కూడా పోస్టు ద్వారా రామ్ చరణ్ వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిది.

Also Read: మోస్ట్ స్టన్నింగ్ బ్యూటీ.. చూస్తే మతి పోవాల్సిందే…

READ ALSO  ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...ఎన్టీఆర్ 30 కి ముహూర్తం ఫిక్స్.
google news
Continue Reading
To Top