Connect with us

కస్టడీ సినిమాలో నీటి కింది సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో తెలుసా?

Latest News

కస్టడీ సినిమాలో నీటి కింది సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో తెలుసా?

కస్టడీ.. నాగచైతన్య హీరోగా, అందాల తార కృతిశెట్టి కథానాయికగా తెరకెక్కిన తాజా చిత్రం. ఈ సినిమా రేపు (మే 12) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించేందుకు ఆ సినిమాలో నీటి కింద చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించిన ఒక మేకింగ్ వీడియోనే యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యతో పాటు, కృతి శెట్టి సైతం కొన్ని అండర్ వాటర్ సన్నివేశాలలో నటించారు. చిత్రబృందం ఆ సన్నివేశాలు చిత్రీకరించడానికి పడిన శ్రమ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. యూట్యూబ్ లో విడుదలైన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. నీళ్లలో జరిగే సన్నివేశాలు కనీవినీ ఎరుగని రీతిలో ఉంటాయని, వాటిని రాజమండ్రి, మైసూర్.. వంటి ప్రదేశాల్లో 20 రోజులకు పైనే కష్టపడి చిత్రీకరించామని చెప్పుకొచ్చారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి.

అలాగే నాగచైతన్య కెరీర్ లో కస్టడీ చిత్రం తప్పకుండా గుర్తుండిపోతుంది అని గట్టిగా చెబుతున్నారు చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు, తమిళ భాషలోనూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కథానాయకుడి పాత్ర పేరు శివ. అందుకే ఈ చిత్రానికి మొదట ‘శివ’ అని పేరు పెట్టాలని భావించారట నిర్మాత. కానీ నాగచైతన్య అందుకు అంగీకరించకపోవడంతో కస్టడీ అని పేరు పెట్టారట.

ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుందని, అందుకే ప్రముఖ నటీనటులు ఈ పాత్రల్లో నటించేందుకు మరే సందేహం లేకుండా అంగీకారం వ్యక్తం చేశారని అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి.. తదితరులు ఇందులో కీలక  పాత్రల్లో నటించగా; ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. విడుదలకు ముందు ఇంతగా ఆకట్టుకుంటున్న కస్టడీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి మరి. నిర్మాత చెప్పినట్లుగా ఈ సినిమా హిట్ అయితే నాగచైతన్యకు తన కెరీర్ లో మళ్లీ ఓ హిట్ పడినట్లే.

READ ALSO  బుచ్చి బాబు కోసం మెగా హీరో రామ్ చరణ్ రెడీ...
google news
Continue Reading
To Top