Connect with us

మహేష్‌బాబుని ఓవర్‌నైట్‌లో హీరోగా నిలబెట్టిన సినిమా..

Latest Cinema news

మహేష్‌బాబుని ఓవర్‌నైట్‌లో హీరోగా నిలబెట్టిన సినిమా..

బాలనటుడిగా తండ్రితో కలిసి కొన్ని సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ మహేష్‌బాబుని తెలుగు సినీ పరిశ్రమకు ఒక నవ యువ కథానాయకుడిగా పరిచయం చేసిన చిత్రం ‘రాజకుమారుడు’. ఈ సినిమా ప్రేక్షకులను పలకరించి నేటితో 24 ఏళ్లు పూర్తవుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్‌బాబుకి జంటగా బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింతా నటించింది. అలాగే ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, సుమలత, ఎమ్మెస్ నారాయణ, జయ ప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, శ్రీహరి.. తదితరులు నటించారు.

నిజానికి ఈ సినిమాలో నటించే సమయానికి ప్రీతీ జింతాకు తెలుగు మాట్లాడడం అంతంత మాత్రమే. ఇక హావభావాలు పలకించడానికి కూడా చాలా శ్రమించిందట. మరి, మన దర్శకేంద్రుడి దర్శకత్వంలో నటించడం అంటే మాటలా?? అందుకే ఈ అమ్మడు రాత్రుళ్లు నిద్ర మాని మరీ తెలుగు సినిమా కోసం చాలా విషయాలు  నేర్చుకునేదట. ఈ విషయాన్ని ప్రీతీనే స్వయంగా ‘రాజకుమారుడు’ సినిమా 19ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో అందరితోనూ పంచుకొచ్చింది. అంతేకాదు.. మహేష్ బాబుతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా, సరదాగా అనిపించేదని, తనకు ఒక మంచి తెలుగు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారకి కృతజ్నతలు అని చెప్పుకొచ్చింది ప్రీతీ.

ఈ సినిమాలో కథ అంతా ఒక ఎత్తు అయితే ఇందులో ఉండే పాటలు మరో ఎత్తు. ముఖ్యంగా ‘గోదారి గట్టు పైన..’, ‘ఎందుకీ ప్రాయమూ నీవు రానప్పుడు..’, ‘ఇంద్రుడు.. చంద్రుడు..ఓ మావ..’ .. ఇలా ఇందులో ఉన్న 6 పాటలు కూడా సినిమాకి బాగా ప్లస్ అవ్వడమే కాదు.. ఇప్పటికీ యూత్‌ని; అందులోనూ లవర్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసే పాటల్లో ఇవి తప్పకుండా ఉండి తీరతాయి. అలాంటి మెస్మరైజింగ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మణిశర్మ అందించారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ నంబర్ 1 పేరిట హిందీలోకి కూడా అనువదించారు. కథనాయకుడిగా మహేష్‌బాబుకి అవసరమైన పుష్ అందించిన ఈ సినిమా ఆయన్ని ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. అందుకే మహేష్‌బాబు కెరీర్‌లో రాజకుమారుడు చిత్రం ఎప్పుడూ ప్రత్యేకంగానే నిలుస్తుంది. మీరేమంటారు?

READ ALSO  వెకేషన్ లో మస్తీ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
google news
Continue Reading
To Top