Connect with us

ప‌సుపు ప‌చ్చ‌లో పెట్టించావ్ గా కేక‌!

Uncategorized

ప‌సుపు ప‌చ్చ‌లో పెట్టించావ్ గా కేక‌!

చీర చుట్టిన చిన్నదాని అందాన్ని వ‌ర్ణించ‌డం ఎవ‌రి త‌రం. హీరోయిన్ సారీ అందంలో అద‌నంగా ఎన్నో ర‌కాల బోనస్ త‌ప్ప‌నిస‌రి. అందులోనూ రంగులోలికే చీర‌లో అయితే హీరోయిన్ అందం మ‌రింత ర‌మ‌ణీయం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అవును ఇక్క‌డ రాశీఖ‌న్నా ప‌సుపు ప‌చ్చ కోక‌లో ఏ రేంజ్ లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాలా? చీర-ర‌విక‌లో అమ్మ‌డు అంద‌మే అసూయ ప‌డేంత అందంగా ఉంది.

అదే వ‌ర్ణం పై పాల నురుగుల శ‌రీర సౌంద‌ర్య ఆ చిలకాకు ప‌చ్చ‌ని మ‌రింత అందంగా తీర్చిదిద్దింది. చెవికి మ్యాచింగ్ దిద్దులు తో అమ్మ‌డు అలంక‌రించుకుంది. సారీ లో రాశీ అందాన్ని రాత‌ల్లో వ‌ర్ణించ‌లేనిది.

అంద‌మంతా నా సొంతం అన్న‌ట్లే హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. రాశీని చీర‌లో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వ్వాటే బ్యూటీ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక ప్ర‌పోజ‌ల్స్ కైతే కొద‌వేలేదు. ఎవ‌రి స్టైల్లో వారు రాశీని ఐల‌వ్ లు చెప్పేస్తున్నారు.

ఇక రాశీఖ‌న్నా కెరీర్ గురించి తెలిసిందే. తెలుగులో కొన్నాళ్ల పాటు బిజీగా కొన‌సాగిన అమ్మడు ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తుంది. ఇక‌పై కెరీర్ అంతా బాలీవుడ్ లోనూ అంటూ ముందుకెళ్తోంది.

ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. కొన్ని కొత్త సినిమాల‌కు సైన్ చేసింది. అవి సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. అలాగే ముంబై క‌ల్చర్ కి ఇప్పుడిప్పుడే అల‌వాటు ప‌డుతోంది.

అక్క‌డ భామ‌ల‌తో ఎలా పోటీ ప‌డాలో? ప‌క్కా ప్ర‌ణాళిక వేసుకుని ముందు కెళ్తుంది. టాలీవుడ్ లో ఉన్నంత కాలం గ్లామ‌ర్ పాత్ర‌లకు దూరంగా ఉన్న అమ్మ‌డు ఇప్పుడు అక్క‌డ పూర్తిగా రూట్ మార్చేస్తుంది. ఇన్ స్టా పోస్ట్ ల‌తోనే గెట్ రెడీ అనేస్తుంది. మ‌రి బ్యూటీ క‌ష్టానికి త‌గ్గ‌ట్టు స‌రైన అవ‌కాశాలు అందుకుంటుందా? తాను అనుకున్న‌ది అక్క‌డ సాధిస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

READ ALSO  నా జీవితంలో సీబీఐ ఆఫీసుకి వెళ్తానని అనుకోలేదు: హీరో విశాల్
google news
Continue Reading
To Top