Connect with us

పుష్పరాజ్ దెబ్బకు సైడ్ అవుతున్న సింగం..

pushba 2

Uncategorized

పుష్పరాజ్ దెబ్బకు సైడ్ అవుతున్న సింగం..

పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ గా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న చిత్రం పుష్ప 2. మొదటి చిత్రం బాక్స్ ఆఫీస్ ని బంతాటాడేసింది. రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ సీక్వెల్ గా రాబోతున్న చిత్రంపై అంచనాలను అమంతం పెంచేసింది. ఈ ఒక్క మూవీ తో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. పుష్ప 2 చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇప్పుడు రెండవసారి బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమవుతున్న పుష్ప దెబ్బకు మిగిలిన సినిమాలు సైడ్ అయిపోయేలా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొదటిసారి అనుకుంటే పుష్ప రాజ్ రెండవసారి భయంకరమైన మాస్ బీభత్సవం సృష్టించేలా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియో సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

ajay devgan

తిరుపతి గంగ జాతర నేపథ్యంలో చీర కట్టుకొని అల్లు అర్జున్ చేసే ఆ ఒక్క ఫైటింగ్ సీన్ మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో పుష్ప 2 థియేటర్లో రిలీజ్ అయిన సమయంలో మిగిలిన సినిమాలు విడుదల అవ్వాలంటే కూడా ఆలోచించే స్థితిలో ఉన్నాయి. మరోపక్క చిత్ర బృందం కూడా మూవీకి సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ క్రేజ్ మైంటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద పెద్ద డైనోసార్ల తయారైన పుష్పాకు ఎదురు వచ్చే సినిమాల కలెక్షన్స్ విషయంలో లెక్కలు మారిపోయే ఆస్కారం ఉంది. బాలీవుడ్ లో కూడా సినిమాల పరిస్థితి ఇంతే. ఎందుకంటే రీసెంట్గా విడుదలైన పుష్ప టీజర్ తాకిడి బాలీవుడ్ లో కూడా భయంకరంగా ఉంది. ఇక పుష్ప చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇదే డేట్ కి రావలసిన అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి సింగం అగైన్ చిత్రం పుష్ప దెబ్బకి తప్పుకునేలా కనిపిస్తోంది.

READ ALSO  NTR Simhadri: సినిమాను మధ్యలోనే వదిలేసిన ఎన్టీయార్..!
google news
Continue Reading
To Top