Connect with us

ప్రాజెక్ట్ కె ఫస్ట్ గ్లింప్స్‌కు స్టార్ట్ అయిన కౌంట్ డౌన్..

Uncategorized

ప్రాజెక్ట్ కె ఫస్ట్ గ్లింప్స్‌కు స్టార్ట్ అయిన కౌంట్ డౌన్..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్, హ్యాండ్‌సమ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొణె.. తదితర భారీ తారాగణం కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం హైప్ క్రియేట్ చేస్తోంది. అందుకే సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ విడుదల అయినా క్షణాల్లోనే వైరల్‌గా మారి అభిమానులను విపరీతంగా ఆకట్టకుంటున్నాయి. తాజాగా వైజయంతీ బ్యానర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రాజెక్ట్ కె చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కౌంట్ డౌన్ మొదలైందంటూ ఓ ఫొటో షేర్ చేశారు. ఫొటోతో పాటు ‘ప్రాజెక్ట్ కె ప్రపంచంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండండి’ అని క్యాప్షన్ ఇచ్చారు.

అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య, భారత కాలమానం ప్రకారం 1.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఈ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన దీపిక ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకోగా; ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై మాత్రం అభిమానులు ఫైర్ అవుతున్నారు. అది ఫస్ట్ లుక్ పోస్టరా? లేక ఫ్యాన్ మేడ్ పోస్టరా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంకొందరు అయితే ఫేస్ ప్రభాస్ దే? మరి బాడీ ఎవరిది?? అంటూ వ్యంగ్యంగానూ కామెంట్ చేశారు. విపరీతంగా జరుగుతున్న ఈ ట్రోలింగ్ నేపథ్యంలో మూవీ టీం ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫొటోను తొలగించింది. ఈ క్రమంలోనే ఫస్ట్ గ్లింప్స్ అయినా ఏ స్థాయిలో ఉంటుందా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నేడు ప్రారంభం అయిన ‘శాన్‌డియాగో కామిక్‌కాన్’ వేడుకల్లో ఈ చిత్రబృందం పాల్గొని సినిమా టైటిల్, ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటూ సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించనుంది. అందుకే ఈ ఈవెంట్ కోసం అభిమానులంతా సర్వత్రా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ నిమిత్తం ప్రభాస్, కమల్ హాసన్ అక్కడికి చేరుకుని ప్రాజెక్ట్ కె హవా చాటుతున్నారు. ‘‘ప్రాజెక్ట్ కె ప్రపంచాన్ని పరిచయం చేసుకునేందుకు అంతా సిద్ధంగా ఉండండి. జూలై 20 (యూఎస్), జూలై 21 (ఇండియా)’’ అంటూ ఇదివరకే కొన్ని పోస్టర్స్ సైతం క్రియేట్ చేసింది మూవీ టీం. కామిక్‌కాన్ వేదిక పై సినిమా ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ చరిత్ర సృష్టించనుంది. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు అయిన సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది వాయిదా పడుతుందనే అనుమానాలే ఎక్కువగా అందరిలోనూ నెలకున్నాయి.

READ ALSO  తన మాట తీరుపై వచ్చిన ట్రైల్స్ కు సంబంధించిన ఎన్టీఆర్……

టైమ్ మిషన్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం సినీ అభిమానులంతా చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

google news
Continue Reading
To Top