Connect with us

Mohana Krishna Indraganti: ఆ హీరోల మీద ఇంద్రగంటి సీరియస్ జోక్.. నమ్మేసిన సుధీర్ బాబు

Mohana Krishna Indraganti with Sudheer Babu

Uncategorized

Mohana Krishna Indraganti: ఆ హీరోల మీద ఇంద్రగంటి సీరియస్ జోక్.. నమ్మేసిన సుధీర్ బాబు

మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) విలక్షణమైన సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. అన్ని ఎమోషన్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయగల సమర్థుడు. తొలి సినిమా ‘గ్రహణం’ నుంచి అదే పంథా పాటిస్తున్నారు. ఈయన ఖాతాలోమంచి సినిమాలే ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) , సుధీర్ బాబు (Sudheer Babu) తో ఈయనకు మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంద్రగంటి తెరకెక్కించినదే ‘వి’ సినిమా (V Movie). ఈ సినిమా విషయంలో సుధీర్ బాబుతో ఓ జోక్ వేశారాయన. అది నిజమని పూర్తిగా నమ్మేశాడట సుధీర్.

#image_title

హీరో సుధీర్ బాబుతో ఇంద్రగంటికి మంచి సాన్నిహిత్యమే ఉంది. ‘సమ్మోహనం’ వీరద్దరికీ మొదటి సినిమా. ఆ తర్వాత ‘వి’, ’ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలకు ఇద్దరూ కలసి పనిచేశారు. ఒక సందర్బంలో వి సినిమా కథ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం మోహన కృష్ణ ఇంద్రగంటి రాశారని రూమర్లు బాగా వినిపించాయి. దీన్ని సుధీర్ బాబు కూడా నిజమే అని చెప్పారు.

#image_title

ఆ ఇద్దరి కాంబినేషన్లో తనకూ ఓ పాత్ర ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అందరూ అది నిజమే అనుకున్నారు కూడా. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అసలు ఈ కథ పవన్, మహేష్ కోసం సిద్ధం చేయలేదట. ఈ విషయం ఇంద్రగంటి స్వయంగా చెప్పారు. అసలు ఆ మాటే ఉత్తుత్తి అని, సరదాగా సుధీర్ తో జోక్ చేశానన్నారు. పాపం సుధీర్ అది నిజమనుకుని నమ్మేశాడు.

ఈ కథ రాసిన తర్వాత నానికి స్టోరీ వినిపించారట. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న విష్ణు పాత్రకు తనైనే న్యాయం చేయగలరని భావించారు ఇంద్రగంటి. నాని కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. డీసీపీీ ఆదిత్య పాత్రకు సుధీర్ బాబు బాగుంటాడని.. అందుకే తనను తీసుకున్నానని చెప్పారు. వి సినిమాలో అదితి రావు హైదరీ, నివేథా థామస్ హీరోయిన్లుగా నటించారు. పెద్ద అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చతికిలపడింది.

#image_title

మోహన కృష్ణ ఇంద్రగంటి మంచి సినిమాల దర్శకుడు. ఆయన ప్రతిభకు ఇప్పటికే పెద్ద హీరోలతో సినిమాలు తీసే అవకాశం రావాలి. కానీ ఆ అవకాశం ఇంద్రగంటికి రాలేదు. ఈ విషయంలో నేచురల్ స్టార్ నాని మినహాయింపు. నానితో కలసి మూడు సినిమాలు తెరకెక్కించారు ఇంద్రగంటి.

READ ALSO  సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్.. రన్ టైం ఎంతో తెలుసా?
google news
Continue Reading
To Top