Connect with us

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్.. రన్ టైం ఎంతో తెలుసా?

Uncategorized

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్.. రన్ టైం ఎంతో తెలుసా?

ప్రస్తుతం ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే సలార్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది .బాహుబలి తర్వాత ఆ రెంజ్ సక్సెస్ తన ఖాతాలో పడకపోవడంతో కాస్త డీలపడ్డ ప్రభాస్ తన ఆశలు మొత్తం ఈ చిత్రం పైనే పెట్టుకున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీతో ప్రభాస్ తిరిగి పూర్వపు ఫామ్ లోకి రావాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది.

ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంది.. అతని మూవీ వస్తోంది అంటే అందరూ ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తారు. అలాంటిది ప్రభాస్ మూవీకి మొట్టమొదటిసారి ఏ సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మూవీలో వైల్డ్ సీన్స్ ఉండడంతో మూవీకి ఫుల్ లెన్త్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.

ఏ సర్టిఫికెట్ అంటే హాట్ సీన్స్ ఉంటాయి అనుకోకండి.. అలాంటివి ఏమీ లేవు వైల్డ్ యాక్షన్ సీన్స్ ఈ మూవీలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ మూవీలో రక్తపాతం, హింసాత్మకమైన సన్నివేశాలు.. చాలా ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బృందం అడల్ట్.. అదే ఏ సర్టిఫికెట్ ఇచ్చేసింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడడానికి అర్హులు.

అంటే చిన్న పిల్లలు దడుచుకునేటుగా ఇందులో సన్నివేశాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి మరి.ఇక ఈ మూవీ రన్ టైం విషయానికి వస్తే.. అటు ఇటుగా మూడు గంటల నిడివితో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మూవీ రన్ టైం 2 గంటల 55 నిమిషాల 22 సెకండ్లు. ఇక విడుదల తర్వాత ఈ మూవీ ఎంత అరాచకం సృష్టిస్తుందో చూడాలి.

READ ALSO  ఈ మధ్యన సోషియల్ మీడియాలో హల్ చల్ అవుతున్న పేరు "ఓరి" ... అసలు ఎవరు ఇతను?
google news
Continue Reading
To Top