Connect with us

‘‘మాతృదేవోభవ’’లో ఆణిముత్యాలకు అక్షరరూపం ఇచ్చారిలా..

Latest News

‘‘మాతృదేవోభవ’’లో ఆణిముత్యాలకు అక్షరరూపం ఇచ్చారిలా..

‘‘వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి..’’,

‘‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?? తోటమాలి నీ తోడు లేడులే…’’

ఈ పాటలు ఇప్పుడు విన్నా సరే.. మనకు తెలియకుండానే మన కళ్లు చెమర్చడం ఖాయం. అంతటి భావోద్వేగాలతో కూడుకున్న సాహిత్యం, మనసులను కదిలించే సంగీతం ఆ పాటల సొంతం. కె. అజయ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘‘మాతృదేవోభవ’’ చిత్రంలోనివే ఈ పాటలు. 1993లో విడుదలైన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కె.ఎస్.రామారావు నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యం అందించారు.

ఈ చిత్రంలోని పాటలు అన్నింటికీ వేటూరి సుందర రామ్మూర్తి గారితో సాహిత్యం రాయించాలన్నది అజయ్ కుమార్ గారి కోరిక. కానీ అప్పటికే ఒప్పుకున్న పాటలు రాయడం తప్ప కొత్త పాటలు రాసేందుకు తీరిక లేని పరిస్థితిలో ఉన్నారు వేటూరి గారు. అందుకే అజయ్ కుమార్ గారు నేరుగా అడిగితే ఎక్కడ వేటూరి గారు కాదంటారో అని తనకు బాగా తెలిసిన వ్యక్తితో అజయ్ గారు గట్టిగా బ్రతిమాలుతూ మరీ అడిగారట. ఇక అంగీకరించక తప్పని పరిస్థితిలో వేటూరి గారు తన కలం కదిలించేందుకు ఒప్పుకున్నారట. అలా కీరవాణి గారితో కలిసి కూర్చుని ‘‘వేణువై వచ్చాను భువనానికి..’’, ‘‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే??’’ పాటల సాహిత్యం ఊపిరి పోసుకున్నాయి.

ఎమ్.ఎమ్.కీరవాణి

ఈ చిత్రంలో తల్లి పాత్రలో నటించిన మాధవి సినిమాకే ప్రాణం పోశారంటే అది అతిశయోక్తి కాదు. వాస్తవానికి తల్లి పాత్రలో ముందుగా జయసుధని అనుకున్నారట దర్శక నిర్మాతలు. కానీ అప్పటికే అలాంటి సెంటిమెంటల్ రోల్స్ చేసిన జయసుధ కాకుండా మరెవరైనా ఫ్రెష్ లుక్ అయితే బాగుంటుందని భావించి బాగా ఆలోచించారట. ఈ క్రమంలోనే తమిళంలో రూసొందిన ఈ చిత్ర మాతృకలో తల్లి పాత్ర పోషించిన మాధవి అయితేనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని, ఆ పాత్రకు న్యాయం చేయగలదని నిర్మాత భావించి, అజయ్ కుమార్ దగ్గర అదే ఆలోచనను వ్యక్తం చేశారట. వెంటనే దర్శకుడు అజయ్ కూడా అంగీకరించడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని చిత్ర నిర్మాణం చకచకా పట్టాలెక్కేసిందట.

READ ALSO  చేయని తప్పుకు నేనెందుకు స్పష్టత ఇవ్వాలంటున్న శోభిత..
google news
Continue Reading
To Top