బాలీవుడ్ దిశగా అడుగులేస్తున్న మహానటి

‘పైలట్స్’, ‘అచనెయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’.. వంటి మలయాళ చిత్రాలలో బాలనటిగా నటించిన ప్రేక్షకులను మెప్పించింది మహానటి. ఆ తర్వాత కథానాయికగా 2013లో గీతాంజలి అనే చిత్రంలో నటించింది. ఇక తెలుగులో 2016 లో ‘నేను.. శైలజ..’ సినిమాతో సినీ అభిమానులను పలకరించి అచ్చం మన పక్కింటి అమ్మాయే అనే ముద్ర వేయించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె నటించిన ‘నేను లోకల్’, ‘అజ్నాతవాసి’.. వంటి సినిమాలతో పాటూ రెమో వంటి సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయి మంచి టాక్ సంపాదించుకున్నాయి.

2018 లో కీర్తి నటించిన ‘మహానటి’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెని ఒక జాతీయస్థాయి నటిగా సినీ పరిశ్రమలో నిలిపిన చిత్రం అది. మిస్ ఇండియా, రంగ్‌దే, గుడ్ లక్ సఖి.. వంటి సినిమాల్లో కీర్తి నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఇక గత ఏడాది విడుదలైన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే 2023లో విడుదలైన దసరాలో వెన్నెల పాత్ర మాత్రం కీర్తి ఏ స్థాయి నటో మరోసారి అందరికీ నిరూపించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో ‘భోళాశంకర్’ సినిమాలో నటిస్తోంది. అలాగే సైరెన్, రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నెవేడి.. మొదలైన చిత్రుల రూపొందుతున్నాయి. అలాగే మామన్నన్ అనే చిత్రం తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మహానటి కీర్తి సురేశ్ తన బాలీవుడ్ తెరంగేట్రానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటోందని చిత్రసీమలో వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన వరుణ్ ధావన్‌తో కోలీవుడ్‌లో భారీ విజయం సాధించిన ‘తేరీ’ రీమేక్‌లో నటించనుందట. ఈ చిత్రాన్ని తమిళంలో దళపతి విజయ్‌తో దర్శకుడు అట్లీ తెరకెక్కించారని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారని; అందులో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్.. నటిస్తున్నారని సమాచారం. మరి, వీటిలో నిజం ఎంతవరకు ఉందో వారే చెప్పాలి.

google news

Leave a Comment