Connect with us

అనుష్క గురించి వినిపిస్తున్న ఈ వార్తలు నిజమేనా?

Latest Cinema news

అనుష్క గురించి వినిపిస్తున్న ఈ వార్తలు నిజమేనా?

అనుష్కాశెట్టి అభిమానులంతా ఆమె స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారో అనుకోని కారణాల వల్ల ఆ సమయం అంత దూరం జరుగుతూ వస్తోంది. 2020లో ‘నిశ్శబ్దం’ అనే ద్విభాషా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఆ తర్వాత ఇప్పటివరకు స్క్రీన్ పై మెరిసింది లేదు. ‘జాతిరత్నాలు’ ఫేం పొలిశెట్టి నవీన్‌తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటిస్తుందని తెలియగానే అభిమాన నటిని సిల్వర్ స్క్రీన్ పై చూసి సంతోషపడవచ్చని భావించారు ఆమె అభిమానులంతా.

 

కానీ ఈ సినిమా వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. చిత్రీకరణ సమయంలో ఈ ఏడాది వేసవి కానుకగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ని విడుదల చేస్తామని ప్రకటించినా ఆ సమయానికి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. మళ్లీ ఆగస్టు 4న విడుదల చేస్తామని తర్వాత ప్రకటించారు. తాజాగా ఈ మూహుర్తం కూడా సినిమా విడుదలకు కుదరనట్లే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల సినిమా విడుదలను మరోసారి వాయిదా వేస్తున్నాం అంటూ చల్లగా ప్రకటించింది చిత్రబృందం. దీంతో అనుష్కని చూడాలనుకున్న అభిమానుల ఆశలన్నీ ఆవిరైపోయాయి.

ఈ సినిమాను ఆగస్టులోనే 18వ తేదీన విడుదల చేయచ్చని చిత్రసీమలో అక్కడక్కడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ వీటి పై ఇప్పటివరకు స్పందించలేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన పాటలు వినసొంపుగానే అనిపించాయి. అయితే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కోసం అభిమానులంతా చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే అనుష్కకు సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది.

ప్రభాస్ – అనుష్క జంట అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి.. ‘బిల్లా, మిర్చి, బాహుబలి..’ వంటి సినిమాల్లో ఇప్పటికే ప్రేక్షకులను అలరించి ది బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ అనిపించుకున్న ఈ జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది అన్నది ఆ వార్త సారాంశం. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఓ కథ రాసుకున్నారని, వీరిద్దరినే హీరోహీరోయిన్లుగా పెట్టి ఆ సినిమా తీయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా అనుష్కను వెండితెర పై చూసే ఆ క్షణం గురించి అభిమానులంతా చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీం ఈసారైనా ఓ తేదీ చెప్పి, ఆ రోజు పక్కాగా సినిమా విడుదల చేస్తారో లేదో చూడాలి.

READ ALSO  టాలీవుడ్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్.. సల్మాన్ మూవీలో ఆ టాలీవుడ్ హీరోలు..
google news
Continue Reading
To Top