Connect with us

డబుల్ అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసిన ‘బ్రో’ టీం

Uncategorized

డబుల్ అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసిన ‘బ్రో’ టీం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ది అవతార్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. తమిళంలో రూపొందిన వినోదయ సీతమ్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులోనూ తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంటున్నారు మేకర్స్. ‘బ్రో’ సినిమాకు తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా; పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను ఇప్పటికే విడుదల చేసిందీ చిత్ర బృందం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వరుసగా సినిమాలోని పాటలను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ‘మై డియర్ మార్కండేయ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయడం, అది పార్టీ మోడ్‌లో సాగుతూ ఫ్యాన్స్‌తో స్టెప్స్ వేయించడం కూడా జరిగిపోయింది. తాజాగా ఈ సినిమాలోని ‘జాణవులే’ అనే పాట లిరికల్ వీడియోను జూలై 15న విడుదల చేస్తామని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇలా ప్రకటించిన 24 గంటల్లోపే బ్రో సినిమాలో మొదటి పాటగా రిలీజ్ చేసిన మై డియర్ మార్కండేయ సాంగ్ మేకింగ్ వీడియోని కూడా విడుదల చేశారు మూవీ టీం. ఇందులో మార్కండేయ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నారు.

మరోవైపు ఈ చిత్రాన్ని జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సైతం టీం ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికే వారాహి విజయయాత్రను కొనసాగిస్తున్న పవన్ ఈ ఈవెంట్‌కు రాకపోవచ్చేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా రావచ్చని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ విషయమై టీం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం తాజాగా విడుదల చేసిన మై డియర్ మార్కండేయ సింగిల్ మాత్రం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. పవన్ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ సాంగ్‌ రిలీజ్‌తో సంతోషిస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అలాగే బ్రూ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ అందించిన స్వరాలు మాత్రం అల్టిమేట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

READ ALSO  నేను ఆ విషయంలో తొందరపడలేదు.. కావాల్సినంత సమయం తీసుకున్నా: నటి అనిత
google news
Continue Reading
To Top