Connect with us

‘హాయ్ నాన్న’లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అంగద్..

Uncategorized

‘హాయ్ నాన్న’లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అంగద్..

న్యాచురల్ స్టార్ నానీ, సీతారామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు ఈ మూవీ టీం. అయితే నిన్న మొన్నటి వరకు చిత్రసీమలో ఈ సినిమా గురించి ఓ వార్త బాగా చక్కర్లు కొట్టింది. ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నారు అన్నది దాని సారాంశం. అయితే దీని పై నానీ కానీ, మూవీ టీం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాజాగా ఓ బాలీవుడ్ నటుడు మాత్రం ఈ వార్త గురించి మాట్లాడారు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఆయన ఏం అన్నారు?? రండి.. మనమూ తెలుసుకుందాం..

అంగద్ బేడీ.. బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. కథానాయకుడిగా ‘పింక్’, ‘టైగర్3’ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు నేహాధూపియా భర్త కూడా. వీరికి సంబంధించిన అప్డేట్స్‌తో సోషల్ మీడియాలో అందరితోనూ టచ్‌లో ఉంటూ ఉంటారు. అయితే ఈయన ఇటీవల ఓసారి మాట్లాడుతూ తన టాలీవుడ్ ఆఫర్ గురించి చెప్పుకొచ్చారు. హాయ్ నాన్న సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా తాను చేరువ కావాలని అనుకుంటున్నట్లు అంగద్ తెలిపారు. అలాగే ఆయన సినిమాలను భాషా బేధం లేకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారని అంగద్ అన్నారు.

శౌర్య దర్శకత్వంలో తండ్రి- కూతుళ్ల అనుబంధ నేపథ్యంలో సాగే ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘హాయ్ నాన్న’ ఉండనుందని ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది. జెర్సీ సినిమాతో తండ్రీ కొడుకుల కథతో కన్నీళ్లు పెట్టించిన నానీ ఈసారి తండ్రీ కూతుళ్ల అనుబంధంతో తెలుగు వారి హృదయాలను కదిలించేందుకు రడీ అయిపోయారని ప్రేక్షకులకు అర్థమైపోయింది. అందుకే ఖర్చీఫ్స్ పట్టుకుని మరీ రడీగా ఉండండి అంటూ కొన్ని ఫన్ మీమ్స్ సైతం సృష్టించారు నానీ ఫ్యాన్స్.

అయితే ఈ సినిమాలో అంగద్ నటిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు కానీ అది ఎలాంటి పాత్ర అన్నది మాత్రం చెప్పలేదు. ఈ సినిమాలో అంగద్ విలన్ పాత్రలో నటిస్తున్నారంటూ అభిమానులు గుసుగుసలాడుకుంటున్నారు. అయినా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లోకి బాలీవుడ్ నటులు రావడం కొత్తేమీ కాదుగా.. ప్రేక్షకులకు కూడా వారిని ఆదరించడం అలవాటుగా మారిపోయింది.

READ ALSO  Relangi Narasimha Rao: ఆ ఇద్దరు హీరోలతో హిట్టు మీద హిట్టు కొట్టిన దర్శకుడు
google news
Continue Reading
To Top