Connect with us

కన్నప్ప మూవీ లో బాహుబలి కాంబో.. ఖుష్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్..

Kannapa movie

Uncategorized

కన్నప్ప మూవీ లో బాహుబలి కాంబో.. ఖుష్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప..డార్లింగ్ ఫ్యాన్స్ కలలు నెరవేర్చేలా కనిపిస్తోంది. బాహుబలి తర్వాత తిరిగి ఈ మూవీలో మరొకసారి డార్లింగ్ పక్కన స్వీటీ కనిపించబోతుందట. భారీ తారాగణంతో భక్త కన్నప్ప జీవిత చరిత్రను కన్నప్ప చిత్రం రూపంలో ప్రేక్షకుల ముందుకు తేవడానికి మంచు విష్ణు చాలా కష్టపడుతున్నాడు.ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకులలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది.

మొదట్లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అంటే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలో నటీనటుల గురించి చెబుతున్న ఆ ఏముందిలే అన్నట్టు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ మూవీలో ప్రభాస్ కూడా ఉన్నాడు అని తెలిసిందో మూవీ రేంజ్ మారిపోయింది. ఒక్కొక్క స్టార్ గురించి రివీల్ చేసే కొద్ది సినిమాపై ఇంట్రెస్ట్ ఒక్కొక్క మెట్టు పెరుగుతూ వెళ్ళింది. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా మిగిలిన భాషల్లో అగ్రతారాలని కూడా ఈ చిత్రంలో ఇంక్లూడ్ చేస్తూ వెళ్తున్నారు.

Kannapa movie

సినిమాలో పాత్రకు సంబంధించి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాక్టర్ ని తీసుకోవడంలో మంచు విష్ణు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ ఆ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు అన్న క్లారిటీ వచ్చింది.. అయితే ప్రభాస్ పక్కన ఎవరు నటిస్తున్నారు అన్న విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక ప్రభాస్ తో పాటు స్టార్ హీరో మోహన్ లాల్, నయనతార, కృతి సనన్, శివ రాజ్ కుమార్ , మోహన్ బాబులాంటి ఎందరో ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నారు.

అంతేకాదు ఈ మూవీలో మంచు వారి మూడు తరాలు కలిసి నటించబోతున్నాయి. మోహన్ బాబు ,మంచు విష్ణు తో పాటు మంచు విష్ణు కొడుకు కూడా కన్నప్ప చిత్రంలో నటిస్తున్నాడు. అవ్రమ్ ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. వీరితో పాటుగా లేటెస్ట్ గా ఈ మూవీకి హిందీ యాక్టర్ అక్షయ్ కుమార్ కూడా యాడ్ అయ్యారు. కన్నప్ప శివ భక్తుడు.. శివుడి సినిమా అంటే పార్వతీదేవి ఉండాలి కదా. మరి అమ్మవారి పాత్రకి ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో మన స్వీటీని మించి ఎవరు సెట్ అవుతారు చెప్పండి. అందుకే పార్వతీదేవి పాత్ర కోసం అనుష్క రంగంలోకి దిగే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే తిరిగి బాహుబలి జోడిని మరొకసారి ఈ స్క్రీన్ పైన చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది.

READ ALSO  Nani Raviteja: సమ్మర్ లో మరింత వేడి పెంచేస్తున్న మాస్ హీరోస్...
google news
Continue Reading
To Top