Connect with us

Nani Raviteja: సమ్మర్ లో మరింత వేడి పెంచేస్తున్న మాస్ హీరోస్…

RAVANASURA

Latest News

Nani Raviteja: సమ్మర్ లో మరింత వేడి పెంచేస్తున్న మాస్ హీరోస్…

Nani Raviteja: ఫిలిం ఇండస్ట్రీకి దసరా, సంక్రాంతి తో పాటు మరో బిగ్ సీజన్ సమ్మర్. స్టూడెంట్స్ కు లాంగ్ హాలిడేస్ ఉండే సీజన్ కావడంతో స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను ఇదే సీజన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ సమ్మర్ కు స్టార్ హీరోలు బరిలో లేకపోయినా మీడియం రేంజ్ స్టార్స్ భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ స్టార్టింగ్ లోనే వస్తున్న సినిమాల విషయంలో మరింత హైప్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ అంటే టాప్ హీరోలు బరిలో ఉంటారు.

dasara

#dasara

కానీ ఈసారి హవా మాది అంటున్నారు యంగ్ జనరేషన్ స్టార్స్. దసరాతో మరోసారి తనలోని మాస్ యాంగిల్ చూపించేందుకు గట్టిగానే రెడీ అవుతున్నారు న్యాచురల్ స్టార్ నాని. చాలా కాలంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు తంటాలు పడుతున్న నాని దసరాతో ఆ కళ నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే మార్చి 30న రిలీజ్ అవుతున్న దసరాతో సమ్మర్ సీజన్ కు వెల్కమ్ చెబుతున్నారు. దసరాతో పాన్ ఇండియా స్టార్ గా మారాలని ఫిక్స్ అయిన న్యాచురల్ స్టార్ ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. ఒక్కో ఈవెంట్ ను ఒక్కో స్టేట్ లో నిర్వహిస్తూ సినిమా మీద అంచనాలు పీక్స్ కు తీసుకువెళ్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయినా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది.

ravanasura

#ravanasura

దసరా రిలీజ్ అయిన వారం తర్వాత ఏప్రిల్ 7 న రావణాసురగా థియేటర్లోకి వస్తున్నాడు రవితేజ. వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న మాస్ మహారాజ్ సినిమా మీద ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ ఉంది. ముఖ్యంగా రవితేజ నెగటివ్ రూల్ ప్లే చేస్తుండడం సినిమా మీద అంచనాలను పీక్స్ కు తీసుకెళుతుంది. రావణాసుర కూడా ప్రమోషన్స్ విషయంలో సూపర్ స్పీడ్ తో ఉన్నారు. వరుసగా 100 కోట్ల సినిమాలతో అలరిస్తున్న మాస్ మహారాజ్ ఈ సినిమాతో మరోసారి తన రికార్డులు తానే తిరగ రాస్తారన్న నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్.

READ ALSO  మాస్ మహారాజాతో నే ఢీ కొడతానంటున్న యంగ్ హీరో..
google news
Continue Reading
To Top