నేను ఆ విషయంలో తొందరపడలేదు.. కావాల్సినంత సమయం తీసుకున్నా: నటి అనిత

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కుచ్ తో హై అనే సినిమాలో నటించింది. అంతే కాదు తమిళ్ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. ఆపై పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనించిన తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనిత. ఈ సినిమా తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తొట్టి గ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ ఇలా వరుసగా సినిమాలు చేసింది. అప్పుడప్పుడు గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. కాగా పెళ్లి కాకముందు కంటే అనిత ఇప్పుడు మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది.

ఇక ఈ అమ్మడు త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. తాజాగా అనిత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్టులో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. పెళ్లి తర్వాత చాలా బరువు పెరిగాను. బరువు తగ్గడానికి నాకు దాదాపు రెండేళ్లు పట్టింది. బరువు తగ్గడం నిజంగా చాలా కష్టం కానీ నేను మాత్రం తొందరపడలేదు. వెయిట్ లాస్‌ కోసం. కావాల్సినంత సమయం తీసుకున్నాను. నేను నా గోల్ కు మరికొన్ని అడుగుల దూరంలో ఉన్నా.. గతంలో నేను నా ప్రెగ్నెన్సీని ఆస్వాదించాను. ఏం జరిగినా మనం మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత శరీరం, హార్మోన్ల మార్పులు, మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తాయని చెప్పుకొచ్చింది అనిత. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

admin

Recent Posts

  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News

పుష్పకు రెండు పెద్ద సవాళ్లు: రూల్

పుష్ప: ది రూల్ అనేది దేశం యొక్క…

6 hours ago
  • Latest Cinema news
  • Latest News

మనం సినిమా 10వ వార్షికోత్సవం సందర్భంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది

నాగార్జున, ఎ నాగేశ్వరరావు మరియు నాగ చైతన్య…

18 hours ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

మోడీతో అనుబంధం ఉన్న హీరోయిన్…?

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేకంగా…

1 day ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

Samantha : సమంత మళ్లీ ప్రేమలో పడింది

హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నాగ…

1 day ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

ప్రభాస్ ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా?

శుక్రవారం నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్…

1 day ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

Rakhul Preeth Singh : రకుల్‌కు షాక్.. పెళ్లయిన రెండు నెలలకే భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది.…

1 day ago