Connect with us

టీజర్ అదిరింది.. శింబు మరో హిట్టు కొట్టేనా…

shimbu

Latest News

టీజర్ అదిరింది.. శింబు మరో హిట్టు కొట్టేనా…

మానాడు సినిమాతో సూపర్ కం బ్యాక్ ఇచ్చిన హీరో శింబు ఇప్పుడు మాసీవ్ సినిమాతో ఇప్పుడు తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎన్ కృష్ణ దర్శకత్వంలో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ పత్తు తల. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పత్తు తల సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. రా అండ్ రస్టిక్ గా తెరెక్కుతున్న పత్తు తల మూవీని టీజర్ తోనే ఎస్టాబ్లిష్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

#krishna

టీజర్ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ వైట్ అండ్ వైట్ లో ఉంటే, శింబు బ్లాక్ అండ్ బ్లాక్ లో ఉన్నాడు. క్యారెక్టర్స్ మధ్య ఈ వేరియేషన్స్ చూస్తుంటే పత్తు తల సినిమా గుడ్ అండ్ బ్యాడ్ మధ్య ఫైట్ లా కనిపిస్తుంది. కానీ ఇందులో నిజంగా బ్లాక్ అనేది బ్యాడ్ కి నిదర్శనమా నలుపు వేసుకున్న శింబు చెడ్డవాడా అనే ప్రశ్నకి సమాధానం పత్తు తల ఇంటర్వెల్ తర్వాత రివీల్ అవుతుంది. కన్నడలో శివన్న నటించిన మఫ్టీ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీకి రీమేక్ గా పత్తు తల తెరకెక్కింది. అందులో శివన్న పోషించిన పాత్రని తమిళ్ లో శింబు ప్లే చేస్తున్నాడు.

#mufti

కన్నడలో శ్రీ మురళి క్యారెక్టర్ ని తమిళ్ వర్షన్ లో గౌతమ్ కార్తీక్ నటిస్తున్నాడు. మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానున్న పత్తు తల సినిమాకి టీజర్ మంచి గ్రౌండ్ ని ప్రిపేర్ చేసింది. కన్నడలో ఉన్న టెంపో ని అలాగే ఉంచి కృష్ణ పత్తు తల సినిమా చేసి ఉంటే మాత్రం శింబుకి సాలిడ్ హిట్ పడినట్లే.

READ ALSO  బాహుబలి 2 ని టార్గెట్ చేసిన పఠాన్... ఆసక్తిగా సినీ అభిమానులు
google news
Continue Reading
To Top