Connect with us

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న రౌడీ బేబీ సింగర్…

dheekshitha

Latest News

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న రౌడీ బేబీ సింగర్…

కొంతమంది వాయిస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. వాళ్లు పాడారంటే పాట వైరల్ అవ్వటం తప్ప మరో ఆప్షన్ ఉండదు. అలాంటి అద్భుతాలే ఇప్పుడు చేస్తున్నారు ఓ సింగర్. ఆమె పేరు తెలియకపోయినా వాయిస్ మాత్రం అందరికీ పరిచయం. తాజాగా దసరా సినిమాలోనూ ఆమె పాడిన పాట మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దక్కించుకుంటుంది. ఇంతకీ ఎవరా సింగర్.

deekshitha సింగర్

#deekshitha

గత నాలుగు రోజులుగా యూట్యూబ్ ను ఈ పాట ఆ పాడిన గొంతు రెండు షేక్ చేస్తున్నాయి. ఏం పాడిందిరా పిల్ల అంటూ ఆ సింగర్ పై కామెంట్స్ వస్తున్నాయి. అంతగా మ్యాజిక్ చేస్తున్న ఆ సింగర్ పేరు దీక్షిత. సింపుల్ గా ధీ అంటుంటారు. దసరా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కూతురే ఈ దీక్షిత. పాడిన ప్రతీ పాటతో మ్యాజిక్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు ఈ సింగర్. డబ్బింగ్, స్ట్రైట్ సాంగా అనే పని లేకుండా ధీ పాడిందంటే ఆ పాట వైరల్ అవ్వాల్సిందే. ఆమధ్య గురు సినిమాలో ఓ సక్కనోడా అంటూ అందరినీ తన గాత్రంతో మాయలోకి నెట్టేశారు దీక్షిత.

deekshitha

#deekshitha

అలాగే మారీ 2 లో రౌడీ బేబీ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందేమో. ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన మారీ 2 సాంగ్ ఇప్పటికే 1.4 మిలియన్ వ్యూస్ సాధించింది. రెండేళ్ల కింద సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో కాటుక కనులే పాట తమిళంలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులోను అంతే పాపులర్ అయింది. తాజాగా దసరా లోను చంకీల అంగేసి పాట నాలుగు రోజుల్లోనే 6.5 మిలియన్ వ్యూస్ అందుకుంది. మొత్తానికి ఒక్కో పాటతో తన క్రేజ్ అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు దీక్షిత.

READ ALSO  ఆర్ఆర్ఆర్ కు మరో గోల్డెన్ అవార్డ్.. అదేంటో చూసేయండి..!
google news
Continue Reading
To Top