Connect with us

మర్డర్ మిస్టరీ గా అలరిస్తున్న టెనెంట్ రివ్యూ..

Tenant movie

Latest News

మర్డర్ మిస్టరీ గా అలరిస్తున్న టెనెంట్ రివ్యూ..

మూవీ: టెనెంట్

నటీనటులు: సత్యం రాజేశ్, ఎస్తేరా నొరెన్హా, మేఘా చౌదరీ, చందన పయ్యావుల, దిలీప్, భరత్ తదిరులు దర్శకతం: వై యుగంధర్
నిర్మాత: ఎం చంద్రశేఖర్ రెడ్డి బ్యానర్: మహాతేజ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2024-04-19

కథ:
కొత్తగా పెళ్లైన గౌతం(సత్యం రాజేష్), సంధ్య(మేఘా చౌదరి) ఇద్దరూ ఓకేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ అద్దకు తీసుకొని ఉంటుంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు సడన్గా కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. తన భార్య శవాన్ని తగలబెట్టిన గౌతం.. భార్య కనిపించడం లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎంక్వయిరీ మొదలు పెడుతుంది. ఇంతకీ ఎంక్వయిరీలో ఏం తేలింది? భార్యాభర్తల మధ్య ఏం జరిగింది? సంధ్య హత్యకు కారణం ఎవరు? తెలుసుకోవాలంటే సినిమా చూడండి.

Tenant movie

విశ్లేషణ:

ఇదొక మంచి మర్డర్ మిస్టరీ సినిమా కావడంతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మూవీకి స్క్రీన్ ప్లే ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ సాగదీత లేకుండా ఆడియన్స్ను ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నారు.. ఫస్ట్ నుంచి చివరి వరకు ఉత్కంఠత భాగం మెయింటైన్ చేశారు. మర్డర్ మిస్టరీ చివరి దాకా రివిల్ చేయకుండా సినిమాని ఫుల్ ఎంగేజింగ్ గా తెరకెక్కించారు.అపార్ట్ మెంట్ కల్చర్ లో ఎలాంటి జాగ్రత్తలతో ఈ మూవీ అర్బన్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ అందిస్తుంది.

ప్లస్ పాయింట్స్;
మూవీ స్క్రిప్ట్, తీసిన విధానం చిత్రానికి హైలైట్ గా నిలుస్తున్నాయి.
సత్యం రాజేష్ నటన చిత్రానికి ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ చిన్న డీటెయిల్స్ మిస్ అయినట్లు అనిపిస్తాయి. వాటిపై కాస్త శ్రద్ధ పెడితే మరింత బాగుందే.

READ ALSO  Senior NTR : ఎన్టీఆర్ చేసిన ఆ పనికి భయంతో సినిమాల్లో డ్యుయెట్స్ మానేసిన వాణిశ్రీ..
google news
Continue Reading
To Top