Connect with us

దశాబ్ద కాలంలో సమంత సృష్టించిన సామ్రాజ్యం ఇదే..

samantha

Latest Cinema news

దశాబ్ద కాలంలో సమంత సృష్టించిన సామ్రాజ్యం ఇదే..

 

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే చిత్రంతో వచ్చి కుర్ర కారు మనసు దోచుకున్న నటి సమంత. అరంగేట్రం చిత్రంతోటి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఇక సామ్ కెరీర్ జ‌ర్నీ ఎంతో సునాయాసంగా సాగింది. టాలీవుడ్ లో ఎందరో అగ్ర హీరోల సరసన సినిమాలు చేసిన సమంత యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది.

సమంత తన సినీ కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికి 14 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.. పెళ్లి ,డైవర్స్ తో పాటుగా అనారోగ్యపరమైన ఇబ్బందులను కూడా దాటుకుంటూ దృఢంగా నిలబడింది. మరి ఈ 14 సంవత్సరాలలో సమంత ఎటువంటి సామ్రాజ్యం సృష్టించిందో తెలుసుకుందాం.

2010లో కెరీర్ ప్రారంభించిన సమంత.. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. అయితే ఈ 14 సంవత్సరాల ఆమె సినీ కెరీర్లో సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులను కూడగట్టినట్లు సమాచారం. ఆమె దగ్గర ఇప్పటికే 1020 కోట్ల మేర నికర ఆస్తులు ఉన్నాయట.
ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె నికర ఆస్తుల గురించి.. ఇతర వివరాల గురించి అభిమానులలో చర్చలు సాగుతున్నాయి. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

samantha

samantha

సినిమాల రెమ్యూనరేషన్, బిజినెస్ వుమన్ గా ఆమె సంపాదించిన ఆస్తులతో పాటు బ్రాండ్ పబ్లిసిటీ వగైరా అన్ని ఆదాయాలు కలుపుకుంటే ఆమె దగ్గర పెద్ద మొత్తంలోనే ఆస్తులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రతి సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఫ్యాషన్ రంగంలో కూడా ఆమె కంటూ వసంత లేబుల్ ఉంది. వీటితో పాటుగా కోట్ల రూపాయల విలువచేసే మెర్సిడెస్ బెంజ్ జి63 ఎఎమ్‌జి,ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్,పోర్షే కేమాన్ జిటిఎస్ లాంటి లగ్జరీ కార్లు ఆమె కలెక్షన్లో ఉన్నాయి.

హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో ఆమె ఒక విలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్నారు. ఈ ఇంటి విలువ సుమారు 20 కోట్లు. అలాగే ముంబైలో ఆమెకు 15 కోట్ల రూపాయల విలువ చేసే ఒక త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఉంది. ముంబై కెరియర్ మీద కూడా దృష్టి పెట్టిన సమంత అక్కడ ఆ అపార్ట్మెంట్ కొనడం జరిగింది. హైదరాబాద్ ,చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాలలో పలుచోట్ల అపార్ట్మెంట్లు కూడా ఉన్నట్లు టాక్.

READ ALSO  హీరామండి తో మరో వివాదం సృష్టించబోతున్న సంజయ్ లీలా బన్సాలీ..?
google news
Continue Reading
To Top