Connect with us

రామ్ చరణ్ మూవీకి గట్టి పోటీ ఇవ్వనున్న కమల్ ఇండియన్ 2…..

Latest News

రామ్ చరణ్ మూవీకి గట్టి పోటీ ఇవ్వనున్న కమల్ ఇండియన్ 2…..

ఒకేసారి రెండు పడవుల్లో ప్రయాణం ప్రమాదం అని పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ ఇదే పరిస్థితిలో ఇరుక్కున్నాడు. 1996లో రిలీజ్ అయ్యి రికార్డు సృష్టించిన కమల్ హాసన్ మూవీ ఇండియన్ డైరెక్ట్ చేసింది శంకర్. ఇదే సినిమా తెలుగులో భారతీయుడు పేరుతో విడుదల చేశారు. ఊహించని రికార్డులు సృష్టించిన ఈ సినిమాకు తిరిగి శంకర్ ఇన్ని సంవత్సరాల తర్వాత తీయడానికి నిర్ణయించుకున్నారు.

షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం రావడంతో భారతీయుడు 2 చిత్రం కాస్త డిలే అవుతూ వచ్చింది. సెట్ లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్, లైక ప్రొడక్షన్స్ వారితో గొడవ లాంటివి తలెత్తడంతో శంకర్ ఈ షూటింగ్‌ను కాస్త పక్కన పెట్టాడు.

తరువాత శంకర్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC 15 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్నో రికార్డులు, అవార్డులు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వస్తున్న నెక్స్ట్ మూవీ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ గా నటించడానికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కియారా అద్వానీని ఎంచుకున్నారు.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హై స్పీడ్ తో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే రాజమండ్రి ,హైదరాబాద్ ,అమృత్సర్ ఏరియాస్ లో మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడం పూర్తయింది. అయితే సడన్గా మరుగున పడిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ మళ్లీ లైన్లోకి రావడంతో ప్రస్తుతం రామ్ చిత్రం కష్టాల్లో పడింది. రెండు చిత్రాలు బ్యాలెన్స్ కాక శంకర్ పై ఒత్తిడి తీవ్రస్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా రామ్ మూవీ దసరా కైనా వస్తుందా లేక ఇంకా ఆలస్యం అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

READ ALSO  సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన సినిమాలు...
google news
Continue Reading
To Top