Connect with us

పుష్ప 2 ఫస్ట్ లుక్, గ్లింప్స్ మరియు దేశముదురు రీరిలీజ్.. తగ్గేదే లే అంటున్న ఫాన్స్..

allu arjun

Latest News

పుష్ప 2 ఫస్ట్ లుక్, గ్లింప్స్ మరియు దేశముదురు రీరిలీజ్.. తగ్గేదే లే అంటున్న ఫాన్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా పుష్ప ది రైజ్. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజై 14 నెలలు అయింది. ఇప్పటివరకు పుష్ప ది రూల్ కి సంబంధించిన ఒక అప్డేట్ ను కూడా మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసినా సుకుమార్ మాత్రం సైలెంట్ గా పుష్పా ది రూల్ సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు.

#pushpa_2

నేషనల్ క్రష్ రష్మిక కూడా పుష్ప ది రూల్ సెట్స్ లో జాయిన్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ ను మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్, అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక్క షూటింగ్ లోకేషన్ పిక్చర్ ని కూడా లీక్ కాకుండా చూసుకుంటున్నాడు. ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత ఏడాది దాటి రెండు నెలలు అవుతుంది, పుష్ప 2 అప్డేట్స్ ఇవ్వండి అని అడుగుతున్న అభిమానులకు అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప ది రూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదే రోజున ఒక గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని సాలిడ్ గా కిక్ స్టార్ట్ చేయాలనేద మేకర్స్ ప్లాన్.

#deshamuduru

ఈ గ్లింప్స్ తో పుష్ప 2 పై ఉండే అంచనాలు అమాంతం పెరుగుతాయి. హైప్ ఆకాశాన్ని తాకుతుంది. చిత్ర యూనిట్ అంతా పుష్ప 2 గ్లింప్స్ ను చూపించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని ఆర్ట్ డైరెక్టర్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఏప్రిల్ 8నే అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ దేశముదురు సినిమాని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. అంటే ఒక్కరోజే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మూడు ఫుల్ మీల్స్ లాంటి న్యూస్ లు బయటకు రానున్నాయి అన్నమాట.

READ ALSO  ఆచార్య పొరపాటు కల్కిలో జరగకూడదు..
google news
Continue Reading
To Top