Connect with us

Ram Charan Birthday: చరణ్‏కు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్.. అల్లు అర్జున్ వీడియో అదుర్స్..

English News

Ram Charan Birthday: చరణ్‏కు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్.. అల్లు అర్జున్ వీడియో అదుర్స్..

రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని.. సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్ఫథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కూతురు క్లీంకార, సతీమణి ఉపాసనతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్ని వెంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు పండితులు. మరోవైపు చరణ్‏కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

అలాగే చరణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రివీల్ చేస్తూ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. సెలబ్రెటీస్, ఫ్యాన్స్ నెట్టింట చెర్రీకి విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ చెర్రీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.

“రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని.. సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్ఫథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు.

 

 

కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి. మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుగు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్పూర్థిగా ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

READ ALSO  తారకరత్న అస్వస్థతపై ఎమోషనల్ అయిన జూనియర్ ఎన్టీఆర్..!
google news
Continue Reading
To Top