Connect with us

ఎన్టీఆర్ తో పౌరాణిక సినిమా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్…

ntr_trivikram

Uncategorized

ఎన్టీఆర్ తో పౌరాణిక సినిమా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. మార్చ్ మూడో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాతో కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో 31వ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ సంవత్సరం చివరిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కనున్నాయి.

ntr_trivikram

#ntr_trivikram

అయితే తర్వాత ప్రాజెకక్ట్ మాత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. వాస్తవానికి అయితే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది డౌట్ అందరిలోనూ ఉంది. కానీ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ డౌట్ క్లియర్ చేసేశారు. నెక్స్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. అయితే మరోసారి ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో రాబోతుందని చెప్పుకోచ్చారు ఇప్పటివరకు త్రివిక్రమ్ టచ్ చేయని జోనర్ లో ఉండబోతుందని ఇదో పౌరాణిక సినిమా అని అన్నాడు. అలాగే మరో సాలిడ్ హింట్ ఇచ్చేశాడు.

ntr_trivikram

#ntr

హాలీవుడ్ మూవీ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రేంజ్ లో ఉంటుందని చెప్పాడు. దాంతో ఇది ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా రాబోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం తారక్ కమిట్ అయిన రెండు సినిమాలు అయిపోయేలోపు త్రివిక్రమ్ కూడా SSMB 28 తో పాటు మరో సినిమా కంప్లీట్ చేయనున్నాడు. ఆ తర్వాత ఈ క్రేజీ కాంబో ఉంటుంది. ఏదేమైనా నాగ వంశీ ఈ రేంజ్ లో చెప్తున్నాడు అంటే ఎన్టీఆర్ తో అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు.

READ ALSO  అత్యంత ధనవంతుడైన నటుడు నాగార్జున్.. ఆయన ఆస్తి ఎంత తెలుసా?
google news
Continue Reading
To Top