Connect with us

ట్రైలర్ తోనే అంచనాలు పెంచేస్తున్న సినిమాలు…

dasara movie

Latest News

ట్రైలర్ తోనే అంచనాలు పెంచేస్తున్న సినిమాలు…

సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై టీజర్ ట్రైలర్ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. టీజర్ ట్రైలర్లతో అట్రాక్ట్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా సోషల్ మీడియానే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేస్తుంది. లేదంటే మేకర్స్ బజ్ కాదు కదా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమానే అందుకు ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆది పురుష్ టీజర్ దెబ్బకు ఏకంగా సినిమానే వాయిదా వేశారు.

#aadipurush

అందుకే ఏ సినిమా తీసుకున్న టీజర్ అదిరి పోయేలా కట్ చేయాల్సిందే. నాని దసరా చిత్ర యూనిట్ ఈ విషయంలో ఫుల్ గా సక్సెస్ అయింది. టీజర్ తోనే ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది దసరా. దెబ్బకు బిజినెస్ డబుల్ అయింది. సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కు బ్లాంక్ చెక్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి బడా బడా నిర్మాణ సంస్థలు. ఇక సినిమా హిట్ అయితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నాని కూడా RRR, కేజిఎఫ్, కాంతార సినిమాలతో పోలిస్తూ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే టీజర్ లో జస్ట్ కొన్ని కీ షార్ట్స్ మాత్రమే చూపించారు. కాబట్టి కథపై క్లారిటీ రావాలంటే ట్రైలర్ రావాల్సిందే.

dasara

#dasara

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దసరా ట్రైలర్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 30 న పాన్ ఇండియా లెవల్ లో దసరా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 16 న దసరా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసుకున్న మూవీ లవర్స్ ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ లోనే కీర్తి సురేష్ వెన్నెల మాస్ లుక్ ను రివీల్ చేయబోతున్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

READ ALSO  ప్రశాంత్ వర్మ మూవీ సూపర్ ఊమెన్..ఈ క్యూట్ బ్యూటీనే..
google news
Continue Reading
To Top