Connect with us

కన్నడ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్న కేజీఎఫ్…

yash hero

Latest News

కన్నడ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్న కేజీఎఫ్…

హాలీవుడ్ లో చాలా సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండియాలో తీసిన చాలా కథలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రేరణ చెందడం తప్పు కాదు. కానీ శాండిల్ వుడ్ మాత్రం అక్కడ హిట్ అయిన సినిమా మేకింగ్ నే నమ్ముకుంటుంది. అక్కడి నుండి వస్తున్న ప్రతి పాన్ ఇండియన్ మూవీని కే జి ఎఫ్ తో పోల్చడం ప్లస్ అవుతుందా లేదంటే మైనస్ అవుతుందా. కేజిఎఫ్ కన్నడ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తుందా లేదంటే పక్కదారి పట్టిస్తుందా.

#upendra

సినిమా కథను డార్క్ బ్యాక్ డ్రాప్ లో నడిపించిన హీరో ఎవరో తెలవకపోయినా శాండిల్ వుడ్ హీరోలు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కేజీఎఫ్, కాంతార, విక్రాంత్ రోనా ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో బడ్జెట్ పెంచేస్తున్నారు. కేజీఎఫ్ రిలీజ్ వరకు యశ్ ఎవరో కన్నడ ఇండస్ట్రీకి తప్ప పక్కనే ఉన్న టాలీవుడ్ కి కూడా తెలియదు. కబ్జా తో వస్తున్న ఉపేంద్ర, సుదీప్ కు తెలుగులో గుర్తింపు ఉంది. మార్టిన్ తో వస్తున్న ధ్రువ సర్జ గురించి బయట ఎవరికి తెలియకపోయినా యష్ మాదిరి అందరికీ నచ్చే పాన్ ఇండియా మూవీతో హిట్ కొడతామన్న నమ్మకంతో ఉన్నాడు.

#martin_movie

కేజిఎఫ్ 2 సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. విక్రాంత్ రోనా సూప్ హిట్ అవ్వడం తో సుదీప్ కూడా తన తరువాత సినిమా కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడట. ఇక ప్రస్తుతం రాబోతున్న ధ్రువ సర్జ మార్టిన్ సినిమా కూడా హిట్ అయితే కన్నడ హీరోలను ఆపడం తరం కాదని అంటున్నారు.

READ ALSO  తగ్గేదేలే అంటున్న సీనియర్ హీరోస్...
google news
Continue Reading
To Top