Connect with us

కల్కి మూవీ లేటెస్ట్ అప్డేట్ ..వెయిటింగ్ తప్పేలా లేదు..

Latest Cinema news

కల్కి మూవీ లేటెస్ట్ అప్డేట్ ..వెయిటింగ్ తప్పేలా లేదు..

బాహుబలి తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన చిత్రం సలార్. ఇప్పటికి కూడా థియేటర్లలో రికార్డ్ సృష్టిస్తున్న ఈ చిత్రం 700 కోట్ల దిశగా దూసుకుపోతోంది. లాంగ్ రన్ లో ఈ మూవీ కచ్చితంగా సాలిడ్ నెంబర్ ను నమోదు చేసే అవకాశం ఉంది అని సినీ విశ్లేషకులు అంచనా. సెల్లార్ మూవీ విజయం తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ ప్రొజెక్ట్ కే అదే కల్కి 2898AD పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మహానటి మూవీ ఫేమ్ నాగ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. టామ్ ఇండియా రేంజ్ను దాటి ఆన్ వరల్డ్ మూవీ గా ఈ చిత్రం అవతరించబోతోంది. మొదట అనుకున్న ప్రకారం కల్కి 2024 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ కాస్త పెండింగ్ ఉండడంతో మూవీ విడుదల తేదీ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీ వచ్చేసరికి హాలిడే ట్రీట్ గా వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2024 సమ్మర్ కి కూడా ఈ మూవీ కష్టమే అన్న డౌట్స్ అక్కడక్కడ వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా ఈ చిత్రం దసరాకి విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుస షెడ్యూలతో ప్లాన్ చేసి సమ్మర్ లోపు ఫినిష్ చేయగలిగితే.. దసరా లోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకొని విడుదల చేసే అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు సలార్ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం కల్తీ షూటింగ్లో పాల్గొంటున్నారు.

ఇండియన్ 2 షూటింగ్ ముగించుకొని కమల్ హాసన్ కూడా త్వరలో సినిమా షూటింగ్లో ప్రభాస్ తో కలిసి పాల్గొంటారు. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ దీపికా పదుకొనే హీరోయిన్గా చేస్తుండగా..బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగా సినిమాని రూపొందించడానికి స్టోరీకి మరికొన్ని మెరుగులు తిట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో చిత్రం షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే దసరా లేక అంతకంటే ఆలస్యం కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని కొందరు భావిస్తున్నారు.

READ ALSO  Balakrishna : చిరంజీవి ఇంట్లో తీసిన బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏంటో తెలుసా…
google news
Continue Reading
To Top