అదిరిపోయే సౌండ్ తో మతి పోగోడుతున్న శబ్దం టీజర్..

సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన శబ్దం చిత్రం టీజర్ తోటే ప్రేక్షకుల సౌండ్ బాక్స్ బద్దలు కొడుతోంది.7G ఫిల్మ్స్ శివ,ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఈరోజు విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మూవీపై అంచనాలను పెంచగా.. రీసెంట్గా వచ్చిన టీజర్ వాటిని డబల్ చేసింది.

టీజర్ లో సినిమాకి సంబంధించిన అదిరిపోయే సెట్ అప్ స్టోరీ పై ఆసక్తిని కలిగించే విధంగా ఉంది. ఇక టీజర్ విషయానికి వస్తే ఒక హాంటెడ్ హౌస్ లోకి ఎంటర్ అయిన ఆది పినిశెట్టి కొన్ని విచిత్రమైన సంఘటనలను విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అసలు విషయాన్నీ ఎక్కడా రివ్యూ చేయకుండా టీజర్ లో సినిమాలో నటిస్తున్న యాక్టర్స్ ని చూపించారు.

ఆది పినిశెట్టి ఈ సినిమాలో తన పాత్రలో చాలా విభిన్నంగా కనిపించారు. టీజర్ మొత్తం గూస్ బంప్స్ క్రియేట్ చేసే విధంగా.. ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంది. ఈ హారర్ త్రిల్లర్ మూవీ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సూపర్ గా సెట్ అయింది. కొన్ని సన్నివేశాలలో మ్యూజిక్ మనల్ని భయపెట్టేసినట్టు అనిపిస్తుంది. ఇక చాలా సీన్స్ లో కొండలు, పర్యాటక ప్రదేశాలు లాంటివి చూపిస్తారు. ఈ పేరుకు తగ్గట్టు చిత్రంలో సౌండ్ కు సంబంధించి కొన్ని ప్రత్యేక సన్నివేశాలు ఉండబోతున్నాయట.

మున్నార్, ముంబై, చెన్నై లోని పలు ప్రదేశాలలో ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఇక సినిమా కోసం 120 ఏళ్ల నాటి ఓ పాత లైబ్రరీ సెట్ ని కూడా నిర్మించారు.సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్క టీజర్ తోనే ఇంత సౌండ్ సృష్టించిన ఈ మూవీ విడుదలయ్యాక బాక్సాఫీస్ బద్దలు కొడుతుందేమో చూడాలి.

admin

Recent Posts

  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News

పుష్పకు రెండు పెద్ద సవాళ్లు: రూల్

పుష్ప: ది రూల్ అనేది దేశం యొక్క…

5 hours ago
  • Latest Cinema news
  • Latest News

మనం సినిమా 10వ వార్షికోత్సవం సందర్భంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది

నాగార్జున, ఎ నాగేశ్వరరావు మరియు నాగ చైతన్య…

17 hours ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

మోడీతో అనుబంధం ఉన్న హీరోయిన్…?

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేకంగా…

1 day ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

Samantha : సమంత మళ్లీ ప్రేమలో పడింది

హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నాగ…

1 day ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

ప్రభాస్ ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా?

శుక్రవారం నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్…

1 day ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

Rakhul Preeth Singh : రకుల్‌కు షాక్.. పెళ్లయిన రెండు నెలలకే భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది.…

1 day ago