Connect with us

Dhamaka: బుల్లితెరనూ షేక్ చేసిన ధమాకా

Uncategorized

Dhamaka: బుల్లితెరనూ షేక్ చేసిన ధమాకా

రవితేజ (Ravi Teja) ను వంద కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమా ధమాకా (Dhamaka). మాస్ మహారాజా స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా ఇది. డివైడ్ టాక్, నెగెటివ్ రివ్యూలను తట్టుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని స్రుష్టించింది. కామెడీ ట్రాక్, పాటలు బాగా వర్కవుట్ అవ్వడంతో ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు టెలివిజన్ లోనూ మంచి టీఆర్పీ రేటింగ్ (TRP Rating) సాధించింది.

#image_title

సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూల సెగ తగులుతూనే ఉంది. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన తర్వాత కూడా అదే నెగెటివ్ టాక్ కంటిన్యూ అయింది. ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఓవర్ రేటెడ్ సినిమా అనే ట్యాగ్ వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టెలివిజన్ ప్రిమియర్ అంటే రేటింగ్స్ అంత బాగా రాకపోవచ్చు. కానీ ధమాకా బుల్లితెరను కూడా దడదడలాడించింది. స్టార్ మాలో మార్చి 26న వరల్డ్ ప్రీమియర్ గా ప్రసారమైంది.

#image_title

టీవీలో మొట్టమొదటిసారి ప్రసారమైన ధమాకా సుమారుగా 10.08 రేటింగ్స్ సాధించింది. టీవీలకంటే ఓటీటీలకే ప్రాధాన్యమిస్తున్న ఈ తరుణంలో ఈ మాత్రం రేటింగ్ సాధించడమంటే మాటలు కాదు. వీలున్నప్పుడు నచ్చినంత సినిమా చూసే సౌలభ్యం ఓటీటీకి ఉంది. అందుకే వీక్షకులు సైతం ఈ తరహా ప్లాట్ఫామ్ ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ధమాకా సినిమాకు నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథ, మాటలు అందించారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. సచిన్ ఖేడ్కర్, జయరామ్, తనికెళ్ల భరణి, రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

#image_title

టీవీలో ప్రసారమైన ఇతర సినిమాల విషయానికి వస్తే నితిన్ హీరోగా నటించిన మాచెర్ల నియోజకవర్గం బుల్లితెర మీద కూడా ఫ్లాపే అయ్యింది. ఇది కూడా టీవీలో మొదటిసారి ప్రసారం అయింది. దీనికి అత్యల్పంగా 2.38 రేటింగ్ వచ్చింది. దీనికంటే.. డబ్బింగ్ సినిమా మట్టి కుస్తీ మంచి రేటింగ్ సాధించింది. తొలిసారి టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు 5.54 రేటింగ్ తెచ్చుకుంది. ఈ సినిమాకు రవితేజ, విష్ణు విశాల్ నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం.

READ ALSO  ఉపాసన కొరకు చరణ్ చేసిన పనికి ఫ్యాన్స్ ఖుషీ..
google news
Continue Reading
To Top