Connect with us

కల్కి మూవీ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా?

prabhas

Latest Cinema news

కల్కి మూవీ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా చిత్రం కల్కి 2898 ఏడీ. నిజానికి ఎప్పటికి విడుదల కావలసిన ఈ చిత్రం ఆంధ్రాలో ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇక ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ రిలీజ్ డేట్ ను మేకర్స్ రీసెంట్గా ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ మూవీ ఒకేసారి 22 భాషలలో చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

కల్కి చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల కి ఇంకా రెండు నెలల సమయం ఉంది.. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కూడా ఉన్నారు. ఈ పోస్టర్లో చుట్టూ యుద్ధరంగం మధ్యలో ఈ ముగ్గురు నిలబడినట్లు కనిపిస్తోంది. ఇక బ్యాగ్రౌండ్ లో ఉన్న పెద్ద చక్రం చాలా పవర్ఫుల్ గా ఉంది.

prabhas

prabhas

పోస్టర్లో ఫైటింగ్ మోడ్ లో ఉన్న దీపిక, బిగ్ బి లుక్స్ అదిరిపోయాయి. ఇక ప్రభాస్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. అతని లుక్స్ ,ఆటిట్యూడ్ వేరే లెవెల్ లో కనిపిస్తున్నాయి. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్లలో లేటెస్ట్ లుక్ ను కంపేర్ చేస్తే.. రెండిటి మధ్య కాస్త తేడా కనిపిస్తోంది. దీన్నిబట్టి ఏ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

గతంలో ప్రభాస్ లుక్స్ తో పోల్చుకుంటే ఈ పోస్టర్ లో ఉన్న కొత్త లుక్ డిఫరెంట్ గా ఉండడమే దీనికి ముఖ్య కారణం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.. మరోపక్క ఇది టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కి చిత్రం కావడంతో ప్రభాస్ భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారని.. అందుకే ఈ లుక్ డిఫరెంట్ గా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ నిజంగా డ్యూయల్ రోల్ చేసి ఉంటే ఈపాటికి ఆ విషయాన్ని మేకర్స్ ప్రకటించేవారు. మరో పక్కఇదంతా ప్రేక్షకులకు స్వీట్ సస్పెన్స్ ఇవ్వడం కోసం ప్రమోషన్స్ వరకు ఆ విషయాన్ని అట్టిపెట్టారా అన్న అనుమానం కూడా కరుగుతోంది.

READ ALSO  Senior NTR : ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని దర్శకుడు ఎంత చెప్పినా వినని ఎన్టీఆర్.. చివరకు ఏం జరిగిందంటే…
google news
Continue Reading
To Top