Connect with us

నరేష్ పవిత్ర పెళ్లి విషయంలో బిగ్ ట్విస్ట్.. అదేంటో తెలిస్తే?

naresh pavitra

Latest News

నరేష్ పవిత్ర పెళ్లి విషయంలో బిగ్ ట్విస్ట్.. అదేంటో తెలిస్తే?

సినిమాల్లో ట్విస్టులు మా అంటే రెండో మూడో ఉంటాయి కానీ సీరియల్ లో ట్విస్టులే బోలేడన్ని ఉంటాయి. రోజులకు రోజులు సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు పవిత్ర నరేష్ యవ్వారంలో కూడా ఇలానే జరుగుతున్నాయి ఇదేంటిది అని అందరిని నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాయి. అప్పుడెప్పుడో ప్రేమించుకుంది మొదలు మధ్యలో కలిసి ఉంటున్నామని చెప్పింది మొదలు తనపై దాడి చేశారని నరేష్ అరిచి గీపెట్టి చెప్పింది మొదలు ఇప్పటివరకు అంతా సీరియల్ లాగా చాలా ల్యాగ్ గా సాగిన నరేష్ పవిత్ర లవ్ స్టోరీ ఒక్కసారిగా ఊపందుకుంది.

naresh pavitra

#naresh_pavitra

తన ట్విట్టర్ లో నరేష్ షేర్ చేసిన ఓ వీడియోతో వారి స్టోరీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వారు పెళ్లి చేసుకున్న వీడియో నిజంగా నిజమేనా లేక సినిమా షూటింగా అనే డౌట్ కూడా అందరిలో కలిగింది. దీనికి తాజాగా నరేష్ ఇచ్చిన ఆన్సర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాజాగా నరేష్ పవిత్ర ను పెళ్లి చేసుకున్న వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన నరేష్, ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడడుగులు నీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్ర నరేష్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ వీడియో తో నెట్టింట తెగ వైరల్ అయ్యారు. అయితే ఇంటింటి రామాయణం సినిమా ప్రెస్ మీట్ లో తాజాగా మాట్లాడిన నరేష్ తన పెళ్లి వీడియో పై రియాక్ట్ అయ్యారు.

naresh pavitra

#naresh _pavitra

ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. రియల్ లైఫ్ వేరు రీల్ లైఫ్ వేరు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తాను. అప్పటివరకు ఓపికతో ఉండండి ప్రస్తుతం నాకు ప్రైవసీ కావాలి అంటూ నరేష్ చెప్పుకొచ్చారు. తన పెళ్లి నిజమో లేక అబద్ధమో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా మాట దాటేశారు. అయితే నెటిజన్స్ మాత్రం ఇంటింటి రామాయణం సినిమాలోనే ఆ పెళ్లి సీన్ అంటూ కోడ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు.

READ ALSO  నందమూరి కుటుంబం నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో కొత్త హీరో...
google news
Continue Reading
To Top