Connect with us

డైరెక్టర్స్ కు కండిషన్స్ పెడుతున్న అజిత్…

ajith kumar

Latest News

డైరెక్టర్స్ కు కండిషన్స్ పెడుతున్న అజిత్…

కూల్ హీరో అజిత్ కూడా ట్రాక్ లోకి వచ్చేసాడు. తోటి తంబీల మాదిరిగానే వరుస ప్రాజెక్టులకు స్కెచ్ వేసి కూర్చుంటున్నాడు. దానిలో భాగంగా దర్శకులకు కొత్త కండిషన్స్ పెడుతున్నాడు. ఇంతకీ అజిత్ పెట్టే కండిషన్స్ కు డైరెక్టర్స్ బెండ్ అవుతారా.

#ajith_kumar

అజిత్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సంక్రాంతికి తంబీల ఫైట్ లో అజిత్ గెలవడంతో మరోసారి అజిత్ కమర్షియల్ ఫిల్మ్స్ కు వెయిట్ ఇచ్చినట్టు అయింది. తాజాగా లైకా ప్రొడక్షన్ తో అజిత్ కమిట్ అయిన తన 62వ సినిమాకు విగ్నేష్ శివన్ ను తొలగించాక కొత్తగా మగిజ్ తిరుమేణి దర్శకుడిగా లైన్ బ్రేక్ లోకి వచ్చాడు. అయితే ఈ సినిమాను అజిత్ పెట్టిన కండిషన్స్ కు తగ్గట్లుగా చేయాల్సి ఉండడంతో క్వాలిటీ అవుట్ పుట్ ఇన్ టైం కి వస్తుందా అనే సందేహం తలెత్తుతుంది. తెగింపు తెలుగులోను వర్కౌట్ కావడంతో ఇప్పుడు చేయబోయే డెవిల్ ప్రాజెక్ట్ షూటింగ్ ను జస్ట్ రెండు మూడు షెడ్యూల్స్ లో పూర్తిచేసి ఈ ఏడాది సెకండ్ హాఫ్ కు ఇవ్వాలని అజిత్ తెగేసి చెబుతున్నాడు.

ajith kumar

#ajith_kumar

గత కొంతకాలంగా అజిత్ సినిమాలకు తెలుగులో కొంతమేర గుర్తింపు వస్తుండడంతో మార్కెట్ పెంచే ప్రాసెస్ లో కో స్టార్స్ కు పోటీ ఇచ్చేలా అతని అడుగులు ఉన్నాయి. అజిత్ కూడా దూకుడు చూపిస్తే మరోసారి తెలుగు మార్కెట్ లో సూర్య, కార్తీ తో పాటు విజయ్, అజిత్ లు స్పేస్ పెంచుకునే అవకాశం ఉంది. తాజాగా ధనుష్ కూడా సార్ తో టాలీవుడ్ ట్రేడ్ లో స్పేస్ దక్కించుకోవడంతో అజిత్ అభిమానులు కూడా తమ హీరో మార్కెట్ పరిధి పెరగాలని కోరుకుంటున్నాను. దానిలో భాగంగానే అజిత్ ఈ అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతుంది.

READ ALSO  RC 15: రాంచరణ్ ఆర్సి 15 టైటిల్ ఫిక్స్.. ఖుషీలో ఫాన్స్...
google news
Continue Reading
To Top