Connect with us

ఆ స్టార్ హీరో కాదన్న తర్వాత OG ఛాన్స్ పవన్ కి దక్కిందా?

Latest News

ఆ స్టార్ హీరో కాదన్న తర్వాత OG ఛాన్స్ పవన్ కి దక్కిందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల‌తో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అతను నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్లో జరిగిన జాప్యం వల్ల వేసవి సెలవులకు అయినా విడుదలవుతుందా అన్న డైనమా లో ఉంది. అయితే ఇప్పుడు పవన్ డైరెక్టర్ సుజిత్ తో OG మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.

సుజిత్ రన్ రాజా రన్ మూవీస్ తో దర్శకుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.శర్వానంద్ ,అడవి శేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. దర్శకుడుగా సుజిత్ కి మంచి గుర్తింపు తేవడంతో పాటు శర్వానంద్ మరియు అడవి శేష్ కెరియర్ లో ఇది పెద్ద ల్యాండ్ మార్క్ గా నిలిచింది.

ఆ తర్వాత సుజిత్ ప్రభాస్ తో పాన్ ఇండియన్ రేంజ్ మూవీ సాహొ ను డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ త్వరగా పరవాలేదు అనిపించుకున్న అనుకున్న రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు సుజిత్ ముచ్చటగా మూడో సినిమాకి పవన్ కళ్యాణ్ తో చేసే గోల్డెన్ ఛాన్స్ ని కొట్టేశాడు.

సాహో సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న సుజిత్ పవన్‌తో మూవీ కంటే ముందు మరో స్టార్ హీరోని కలిశారు. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. రీజన్ తెలియదు కానీ మహేష్ ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదు.. మరి ఇప్పుడు ఈ మూవీ పవన్ ఓకే చేశాడు.దే కాల్ హిట్ OG అనే క్యాప్షన్ తో గ్యాంగ్స్టర్ స్టోరీ బేసిస్ మీద ఈ మూవీ తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఇందులో మంచి పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ రోల్ లో కనిపించనున్నారు.

READ ALSO  యాక్షన్ డోస్ పెంచేసిన వెంకీ మామ..
google news
Continue Reading
To Top