ఖిలాడి బ్యూటీకి గుంటూరు కారం ఐటెం..!

గుంటూరు కారం లో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయడం లేదని.. ఆ పాటలో ఖిలాడి బ్యూటీ డింపుల్‌ హయతి కనిపించబోతుందని యూనిట్‌ సభ్యుల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది

ఇక గుంటూరు కారం సినిమాలో ఒక మాస్ ఐటెం సాంగ్ ఉంటుందని మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సిన పూజా హెగ్డే ఛాన్స్ మిస్ చేసుకున్న విషయం తెల్సిందే.

ఐటం సాంగ్స్ కి డింపుల్‌ పెట్టింది పేరు అన్నట్లుగా ఈ మధ్య కాలంలో మారింది. అందుకే త్రివిక్రమ్‌ ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

థమన్‌ స్వరపర్చిన మాస్ ఐటం సాంగ్‌ లో మహేష్ బాబు మరియు డింపుల్‌ హయతి ల డాన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందని యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

సంక్రాంతికి రాబోతున్న అన్ని సినిమాల్లోకి గుంటూరు కారం సినిమాకు ఎక్కువ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకే ఏ విషయంలో కూడా ఛాన్స్ తీసుకోకుండా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో గతంలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాల ఫలితాలు నిరాశ పరిచిన కూడా.. ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అలాంటి క్రేజీ సినిమాలో డింపుల్‌ హయతి ఐటం సాంగ్‌ చేయబోతున్న నేపథ్యంలో ఆమె కెరీర్‌ కచ్చితంగా యూటర్న్‌ తీసుకునే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

అందుకే త్రివిక్రమ్‌ ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.