Latest News
Samyuktha Menon: నక్క తోక తొక్కిన పవన్ చెల్లెలు..
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా హిట్లు అందుకుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే.. అది సంయుక్త మీనన్(Samyuktha Menon). తొలి సినిమా భీమ్లా నాయక్ (Bhimla Nayak) నుంచి విరూపాక్ష(Virupaksha) వరకు ఒక్క ఫ్లాపు లేకుండా జర్నీ కొనసాగిస్తోంది. ప్రస్తుతం మీడియం బడ్జెట్ రేంజ్ చిత్రాలకు తొలి ప్రాధాన్యమున్న హీరోయిన్ గా మారింది.
సంయుక్త మీనన్ తొలిసినిమా భీమ్లానాయక్. ఇందులో రానా భార్యగా నటించింది. సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ కనిపించినంత సేపు మంచి స్క్రీన్ ప్రజెన్ ఉన్న అమ్మాయిలా కనిపించింది. తన స్టామినాను చూపించడానికి ఆమెకు వచ్చిన ఒకే ఒక అవకాశం క్లైమాక్స్. దాన్ని బాగా వాడుకుంది. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది.
సంయుక్త మీనన్ రెండో సినిమాగా వచ్చిన బింబిసార.. ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో అమ్మడి దశ తిరిగింది. ఏకంగా ధనుష్ సరసన సార్ సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో వంద కోట్ల హీరోయిన్ క్లబ్బులో చేరిపోయింది. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్ లో సంయుక్తమీనన్ కూడా ఒకరు.
ఇక తాజాగా విరూపాక్ష సినిమాతో మరోసారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమాలో నటనకు బాగా స్కోప్ ఉంది. ఇక తన స్టామినా ఏంటో మరోసారి చూపించింది సంయుక్త మీనన్. విరూపాక్ష సినిమా ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద మంచి జోరుతో కొనసాగుతోంది. వరుసగా సెలవులు కూడా రావడంతో భారీ వసూళ్లు ఖాయమనే మాట వినిపిస్తోంది.
ఇలా వరుస విజయాలతో ఈ కేరళ అమ్మాయి తిరుగులేని హీరోయిన్ గా టాలీవుడ్ లో స్థిరపడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా ఒక సినిమా హిట్టయితే చాలు అమాంతం రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తున్నారు కథానాయికలు. సంయుక్త మీనన్ ఈ విషయంలో మినహాయింపు. దీంతో మీడియం రేంజ్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. టాలెంట్ ఉన్న హీరోయిన్లు హై బడ్జెట్ చిత్రాలు లేదా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలకు పరిమితమవుతున్నారు. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన హీరోయిన్ల డేట్లు మరీ కాస్ట్లీగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. అందం, నటన, టాలెంట్ అన్నీ పుష్కలంగా ఉన్న సంయుక్త మీనన్ ఖాతాలో మరిన్ని హిట్లు పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.