Virupaksha : ‘విరూపాక్ష’ మూవీ రివ్యూ.. సాయి ధరమ్ తేజ్ హిట్టు కొట్టినట్టేనా…

చిత్రం : విరూపాక్ష

రేటింగ్ : 3/5నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సునిల్, అజయ్, సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల తదితరులు

దర్శకుడు : కార్తిక్ వర్మ దండు

నిర్మాత : బి.వి.యన్.ఎస్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : శాందత్ సైనుద్దీన్

ఎడిటర్ : నవీన్ నూలి

సంగీతం : బి అజనీష్ లోక్ నాథ్‌

Virupaksha : కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. సాయి ధరమ్ తేజ్ కు జంటగా సంయుక్త మీనన్ నటించింది.

virupaksha_movie
#virupaksha_movie

కథ :

రుద్రవరం అనే ఓ గ్రామం అనుమానస్పద హత్యలతో భయానకంగా మారుతుంది. ఆ ఊరిలో క్షుద్ర పూజలు ఒక కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు చంపేస్తారు. ఆ జంట కుమారుడిని ఆ ఊరి నుంచి పంపించేస్తారు. ఇది జరిగిన పుష్కరకాలం తర్వాత సూర్య అంటే సాయిధరమ్ తేజ్ తన తల్లితో పాటు రుద్రవరం ఊరుకు వస్తాడు. రుద్రవరం తన తల్లి ఊరు కావడంతో ఆ ఊరితో సూర్యకి సంబంధం ఉంటుంది. ఈ విధంగా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య నందిని అంటే సంయుక్త మీనన్ తో సూర్య ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ పొందడం కోసం సూర్య ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు ఆ గ్రామంలో వరుసగా మనుషులు చనిపోతూ ఉంటారు. దాంతో ఆ ఊరి ప్రజలంతా భయంతో వణికి పోతారు.

అసలు హత్యలు ఎవరు చేశారు? గ్రామానికి చేతబడి ఎందుకు చేశారు అన్న వాటిని వెతుక్కుంటూ హీరో ప్రయాణమే ‘విరూపాక్ష’ సినిమా. అసలు విరూపాక్ష అంటే ‘రూపంలేని కన్ను’ అని అర్థం, శివుడి పేరు. రూపం లేని వాటితో హీరో చేసే సంఘర్షణ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ట్రైలర్ చూశాక చాలామంది విరూపాక్షని కాంతార తో పోల్చారు. కానీ కాంతార ఓ క్లాసిక్. విరూపాక్ష సస్పెన్స్ థ్రిల్లర్. వాటికి పొంతనలేదు. విరూపాక్ష చాలా వైవిధ్యంగా ఉంటుంది. కథలో కొత్త క్యారెక్టర్స్ రావడం అలాగే ఊహించని ట్విస్టులతో సినిమా చాలా వేగంగా సాగుతుంది. ప్రతి 20 నిమిషాలకు కొత్తదనంతో కథ సాగుతుంది. చివరికి ఆ గ్రామంలో జరిగే హత్యలకు కారణాలు చేదించడమే హీరో లక్ష్యం. అలాగే తాను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకున్న హీరో ఏం చేశాడు అనేది కథ.

sai_dharam_tej
#sai_dharam_tej

విరూపాక్ష లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. ఈ విషయంలో విరూపాక్ష సక్సెస్ అయింది. సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే సూపర్ గా ఉంది. ఒకవైపు పుష్ప పనుల్లో చాలా ఉన్న సుకుమార్ మెగా ఫ్యామిలీ కోసం సాయి ధరమ్ తేజ సినిమాకి స్క్రీన్ ప్లే ఇచ్చారు. అసలు ఈ కథలో వచ్చే మలుపులు, మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడతాయి. చివరి వరకు కథలో సస్పెన్స్ మెయింటెన్ చేయడంలో దర్శకుడు దానిని పట్టుకొని, ఆడియన్స్ ను తన నటనతో లాక్ చేయడంలో హీరో కూడా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్. అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగుంటాయి. ఇలాంటి కథలలో క్లైమాక్స్ ని అందరూ ముందుగానే ఊహిస్తారు. సరిగ్గా అలాగే ఇక్కడ కూడా అంచనాలకు తగ్గట్లే క్లైమాక్స్ వర్షం సాగుతుంది.

నటీనటులు :

సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. రిస్కీ యాక్షన్స్ సన్నివేశాలలో అతని ఎఫర్ట్ మనం కచ్చితంగా గుర్తించాలి. కానీ ఇక్కడ మరో విషయం ఉంది. అదేమిటంటే కొన్ని సన్నివేశాలలో సాయి ధరమ్ తేజ్ నీరసంగా కనిపిస్తాడు. డైలాగ్ డెలివరీ కూడా అలాగే సాగింది. బహుశా అతనికి జరిగిన ప్రమాదం వలన అతని డైలాగ్ డెలివరీ స్టైల్ మారింది అనుకొని సర్దుకోవాలి. ఇక సంయుక్త మీనన్ కి ఈ సినిమాలో పర్ఫామెన్స్, అలాగే గ్లామర్ ఇలా రెండు కోణాలలో చేసే అవకాశం లభించింది. ఆమె ఈ సినిమాకి ప్లస్ అయింది. ఆమె లక్కీ హీరోయిన్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.

సాంకేతిక విభాగం :

ఇలాంటి సినిమాలకి కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. దానిని అద్భుతంగా నెరవేర్చాడు కెమెరామెన్ శాందత్. ఆయన ప్రతి ఫ్రేమ్ ని ఎలివేట్ చేశారు. ముఖ్యంగా సీన్స్ లో లైటింగ్ నైట్ సూపర్ గా ఉంటుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ తన బిజీఎం తో సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు. రెండు పాటలు కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లో వచ్చిన మ్యూజిక్ మనల్ని భయపెడుతుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడా తగ్గలేదు. సాయి ధరమ్ తేజ్ స్టామినా కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇక ఫైనల్ గా సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ కార్తీక్ దండు తన దర్శకత్వ కళను నెరవేర్చుకున్నాడు. ఒక మంచి సినిమా తీసి సూపర్ అనిపించుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ ఆయన కష్టం కనబడుతుంది.

ప్లస్ పాయింట్స్ :

నటినటులు, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

లవ్ స్టోరీ, క్లైమాక్స్, కొన్ని సాగదీత సన్నివేశాలు

google news

Leave a Comment