కృతి శెట్టికి ఎంతటి కష్టం వచ్చింది?.. శ్రీలీల పరువు కూడా పోయిందే!

కృతి శెట్టి ఉప్పెన సినిమాతో ఎగిసి వచ్చింది. అయితే వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని మాత్రమే అనుకున్నట్టుగా ఉంది. అందుకే కథ, కథనాలు ఏంటి? పాత్ర ఏంటి? అన్నది పట్టించుకోకుండా వచ్చిన ప్రాజెక్టులన్నింటినీ ఒప్పేసుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఫలితంగా కృతి శెట్టి ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఉప్పెన తరువాత మళ్లీ ఇంత వరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయింది. కృతి శెట్టి ఎంత ఫాస్ట్‌గా ఎదిగిందో అంతే వేగంగా కిందకు దిగినట్టు అయింది. ఇక కృతి శెట్టి బాటలోనే శ్రీలీల కెరీర్ కూడా కొన్ని రోజుల్లో కనుమరగయ్యేలా ఉంది.

ఇక శ్రీలీలకు పెళ్లి సందడి, ధమాకా చిత్రాలు బాగా కలిసి వచ్చాయి. ఆ రెండు చిత్రాలతో శ్రీలీలకు టాలీవుడ్‌లో ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికినట్టు అయింది. ధమాకా తరువాత శ్రీలీలకు ఆఫర్లు మరింతగా వెల్లువెత్తాయి. గత ఏడాది ద్వితీయార్దంలో నెలకు ఒక సినిమా అన్నట్టుగా వచ్చింది. కానీ అందులో ఒక్కటే కాస్త పర్వాలేదన్నట్టుగా శ్రీలీలకు పేరు తెచ్చి పెట్టింది.
రామ్‌తో చేసిన స్కంధ, వైష్ణవ్ తేజ్‌తో చేసిన ఆది కేశవ, నితిన్‌తో తీసిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా అన్నీ బోల్తా కొట్టేశాయి. బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి శ్రీలీలను కాపాడేసినట్టు అయింది.
ఈ ఏడాది గుంటూరు కారం అంటూ మరో ఫ్లాపును మూట గట్టుకుంది. సినిమా సంగతి పక్కన పెడితే శ్రీలీల పోషించే పాత్రలు మరింత నాసిరకంగా ఉంటున్నాయి. కేవలం నాలుగు స్టెప్పుల కోసమే ఆమెను తీసుకుంటున్నట్టుగా ఉంది.అయితే తాజాగా కృతి శెట్టి షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లినట్టుగా ఉంది.
అక్కడ ఓ అభిమాని స్కంధ సినిమా బాగుంది అన్నాడు. ఓ అవునా అంటూ నవ్వేసింది..స్కందలో నేను లేను అంటూ కూల్‌గా రిప్లై ఇచ్చింది. అంటే స్కందలో హీరోయిన్ ఎవరన్నది కూడా గుర్తు లేదన్న మాట.
శ్రీలీల, కృతి శెట్టిలు ఒకే లైన్‌లో పరిగెడుతున్నారని, ఇద్దరికీ పెద్ద తేడా లేదని ఆ ఒక్క మాటతో అర్థం చేసుకోవచ్చు.
google news

Leave a Comment