38 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిపోయిన వరలక్ష్మి శరత్ కుమార్… ఆ తమిళ స్టార్ హీరోతోనే!

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు వరలక్ష్మీ శరత్​కుమార్​. ఈ సీనియర్​ నటుడు, శరత్ కుమార్ వారసురాలిగా ఫిల్మ్​ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, మొదట హీరోయిన్‌గా అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. కానీ ఆ తర్వాత క్యారెక్టర్‌ఆర్టిస్ట్‌గా సూపర్ సక్సెస్ అయింది. ప్రతినాయికగా, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ సినీప్రియుల్ని మెప్పిస్తోంది. రీసెంట్‌పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌హిట్‌చిత్రం ‘హనుమాన్’లోనూ హీరో అక్క అంజ‌మ్మ‌గా తన నటనతో అదరగొట్టేసింది. అయితే విభిన్న పాత్రల్లో విలక్షణమై నటనతో అభిమానుల్ని అలరిస్తున్న ఈమె పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోను వివాహమాడనుందని సమాచారం అందుతోంది. వివరాల్లోకి వెళితే..

నో సక్సెస్​: సీనియర్​నటుడు శరత్​కుమార్ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్​కేరీర్ ప్రారంభంలో విశాల్, శింబు సహా పలువురు హీరోలతో కలిసి హీరోయిన్​గా నటించింది. కానీ ఆ చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఆమె హీరోయిన్​గా పెద్దగా సక్సెస్​కాలేకపోయింది.

లేడీ విలన్​గా సూపర్ సక్సెస్​: హీరోయిన్​గా సక్సెస్​అందుకోపోయినప్పటికీ వరలక్ష్మీ తన విలక్షణమైన నటనతో ఆడియెన్స్​ను బాగానే మెప్పిస్తోంది. కథానాయకురాలిగా కాకుండా లేడీ విలన్​గా ఊహించని రేంజ్​లో రెస్పాన్స్​ను అందుకుంది. ఈమె నటించిన సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకృష్ణ బీఎల్, క్రాక్ చిత్రాలు ఆడియెన్స్​ను సర్​ప్రైజ్​చేశాయి. ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వరుసగా రావడం మొదలయ్యాయి.

హనుమాన్​తో భారీ సక్సెస్​: అలా గతేడాది వీరసింహారెడ్డితో మంచి సక్సెస్​అందుకున్న ఈమె రీసెంట్​గా భారీ బ్లాక్ బస్టర్‌హిట్‌చిత్రం ‘హనుమాన్’​లోనూ హీరో అక్క అంజ‌మ్మ‌గా తన నటనతో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్​తో విజయోత్సాహంలో ఉంది. అలా ఈ మధ్య తెలుగు చిత్రాల్లో ఈమె మంచి మంచి పాత్రలు చేస్తూ హిట్స్ కొడుతున్న ఈమె 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈమె పెళ్లి గురించి వార్తలు మళ్లీ మొదలయ్యాయి. ఓ స్టార్ హీరోతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు.

శింబుతో పెళ్లి: వరలక్ష్మిలాగానే శింబు కూడా సింగిల్‌గా ఉండటం వల్ల ఈ వదంతులు మరింత ఎక్కువయ్యాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని చెప్పుకొస్తున్నారు. కాగా, శింబు గతంలో నయనతార, హన్సికతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఆ మధ్య నిధి అగర్వాల్‌తోనూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

google news

Leave a Comment