మెగాస్టార్ మూవీలో లక్కీ స్టార్.. ఈ కాంబో హీట్ అవుతుందా..

టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి తన నెక్స్ట్ మూవీ కోసం భారీ ప్లానింగ్ లో ఉన్నాడు. వాల్తేరు వీరయ్య రూపంలో సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి సక్సెస్ అందుకున్న చిరు ఆ తర్వాత బోలాశంకర్ అంటూ బోల్తా పడ్డాడు. దీంతో ఇప్పుడు విశ్వంభరా మూవీ తో ఎలా అయినా సక్సెస్ సాధించాలి అనే ఉద్దేశంతో ప్రతి డెసిషన్ ఎంతో ఆచితూచి తీసుకుంటున్నారు.

భారీ అంచనాల మధ్య వచ్చిన భోళాశంకర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈసారి తన 156 మూవీతో ఎలా అయినా సక్సెస్ కొట్టాలి అనే ఉద్దేశంతో
బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట డైరెక్షన్లో ఓ ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ పై అంచనాలను భారీగా ఉన్నాయి.కాన్సెప్టు పోస్టర్, గ్లింప్స్ వీడియోలో బాగా ఆకట్టుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది వరుస షెడ్యూలతో ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఒక స్పెషల్ పాత్ర పై క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. గత కొద్దికాలంగా సెకండ్ ఇన్నింగ్స్ హీరోల సినిమాలన్నిటికీ లక్కీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ మూవీలో కూడా కీలకమైన పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరలక్ష్మీని ఓ మంచి పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నారని ..ఆమె చేసిన మిగిలిన సినిమాల్లో లాగానే ఇందులో కూడా ఆమె చేసే పాత్ర ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది టాక్.

google news

Leave a Comment