మహానటి సావిత్రి.. అతిలోక సుందరి శ్రీదేవి.. టాలీవుడ్ లోనే కాక మిగిలిన భాషల్లో కూడా తమ సత్తా చాటుకున్న
మేటి సినీ తారలు. సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ దివంగత నటుల గురించి సీనియర్ రచయిత తోటపల్లి మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య ఉన్న ఒక పోలిక గురించి మాట్లాడుతూ వారి జీవితం అలా అవ్వడానికి అదే ముఖ్య కారణం అని విమర్శించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందానికి ,అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హీరోయిన్స్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సావిత్రి.. ఆ తర్వాత శ్రీదేవి. తెలుగుతనం ఉట్టిపడేలా.. గడుసుతనం ,అల్లరితనం కనిపించేలా.. అందంతో పాటు అమాయకత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఈ ఇద్దరు నటించారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈ ఇద్దరు అసమాన్య కీర్తి అందుకోకుండా అర్ధాంతరంగా మరణించారు.

ఆ విషయం పక్కన పెడితే ఈ ఇద్దరికీ విపరీతమైన మద్యం అలవాటు ఉంది అని తోటపల్లి మధు పేర్కొన్నారు. సావిత్రి మధ్యానికి బానిసవ్వడానికి కారణం.. వేరెవరో కాదని.. ఒకసారి అలవాటు చేసుకున్న ఆమె తాగుడికి బానిసగా మారిందని మధు పేర్కొన్నారు. తాగడం వల్ల విపరీతంగా లావు రావడం.. లా వచ్చేస్తున్నాను అన్న దిగులుతో మళ్ళీ తాగడం.. ఇలా ఆమె తన కెరీర్ ని తన చేతులతోటే నాశనం చేసుకుంది. అని ఆయన అన్నారు. అంతేకాదు సావిత్రి గారు తాగి 14 సంవత్సరాలు బతికితే శ్రీదేవి అదే తాగుడు అలవాటుతో 14 నిమిషాలలో చనిపోయింది అని పేర్కొన్నారు.
55 సంవత్సరాల వయసు వచ్చేసరికి శ్రీదేవికి తాగుడు వల్ల బిపి ,షుగర్ అన్ని వచ్చేసాయని మధు పేర్కొన్నారు.
శ్రీదేవికి తెలియకుండా చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందట. అప్పటికే నార్త్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న ఐశ్వర్యా రాయ్..కత్రనా కైఫ్..దీపీకా పదుకొణే లాంటి అందమైన హీరోయిన్లు కారణంగా తన ఫ్యూచర్ గురించి దిగులు పడేదట. ఇక అందంగా కనిపించాలి అనే ఉద్దేశంతో అసలు తిండి తినకుండా విపరీతమైన డైటింగ్ చేసేవారట. ఒకవేళ భోజనం చేసిన అందులో ఎటువంటి ఉప్పు కారం లేకుండా చూసుకునేవారట. సినీ ఇండస్ట్రీ ఒక మత్తు ప్రపంచం.. ఒకసారి దానికి అలవాటు పడితే అందంగా కనిపించడం కోసం ఏమైనా చేస్తారు. ఒకప్పుడు హీరోయిన్లు తమ అందం మెయింటైన్ చేయడానికి మద్యం పుచ్చుకునేవారు.. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ ఏ వాడుతున్నారు అని మధు అన్నారు.