సౌత్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్… కారణం అదేనా…

సౌత్ సినిమా గ్లామర్ బ్యూటీస్ ని కూడా గట్టిగానే అట్రాక్ట్ చేస్తుంది. మన సినిమాలు బాలీవుడ్ ని డామినేట్ చేస్తూ ఉండటంతో నార్త్ బ్యూటీస్ సౌత్ తో మింగిల్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా అప్ కమింగ్ హీరోయిన్స్ ఈ లిస్టులో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఎయిర్ ఫోర్స్ బేస్డ్ మూవీతో సౌత్ ఎంట్రీ కి రెడీ అవుతున్నారు మానుషి చిల్లర్. బాలీవుడ్ లో సామ్రాట్ పృధ్విరాజ్ మూవీ మాత్రమే చేసిన మానుషి వెంటనే సౌత్ వైపు చూస్తున్నారు.

#nargis_fakri

వీటీ 13 టీమ్ ఇచ్చిన అనౌన్స్మెంట్ తో సౌత్ లోనూ మానుషి గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మానుషి హీరోయిన్ గా నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. నార్త్ లో ఫస్ట్ హిట్ చూడక ముందే మానుషికి సౌత్ ఆఫర్ రావడంతో ఈ బ్యూటీ స్టార్ లీడ్ లోకి రావడం పక్కా అనే టాక్ వినిపిస్తుంది. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఏజెంట్ లోను ఓ బాలీవుడ్ క్యూటీ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. నార్త్ లో ఇంకా సినిమాలు చేయకపోయినా గ్లామర్ వరల్డ్ లో సాక్షి వాద్య పేరు గట్టిగా వినిపిస్తుంది. అందుకే నార్త్ మేకర్స్ ఛాన్స్ ఇవ్వకముందే మనవాళ్లు సాక్షికి అవకాశం ఇచ్చారు. జాన్వి కపూర్ కూడా ఈ సంవత్సరం సౌతమే ఖర్చుతో సౌత్ మేకర్స్ తో మింగిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు అనే టాక్ వినిపిస్తుంది.

#manushi_chillar

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ తో సౌత్ ఆడియన్స్ ను పలకరించేందుకు రెడీ అవుతున్నారట జాన్వి. ఈ లిస్టులో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న మరో పేరు నర్గీస్ ఫక్రి. బాలీవుడ్ లో పెద్దగా ఫేం లేకున్నా సౌత్ లో మాత్రం పవర్ స్టార్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు నర్గీస్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు సినిమాలో యువరాణి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే నర్గీస్ కి సౌత్ లో ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.

google news

Leave a Comment