ఇలియానా… అందుకే సౌత్ లో సినిమాలకు దూరం…

దేవదాసు మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇలియానా. ఈ గోవా బ్యూటీ అప్పటి స్టార్ హీరోలు అందరితో సినిమాలలో నటించింది. గతంలో వరుస పెట్టి తెలుగులో సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు తెలుగు సినిమాలలో కనిపించడమే మానేసింది.

2018 రవితేజ తో కలిసి అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో సందడి చేసింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాలకే అంకితం అయిపోయి తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. అందరూ ఆమె హిందీ సినిమాలతో బిజీగా ఉండి తెలుగులో సినిమాలు చేయడం లేదు అనుకుంటున్నారు తప్ప అసలు కారణం ఎవరికీ తెలియదు.

ileana
#image_title

ఇలియానా పై తమిళ్ సినీ ఇండస్ట్రీ నిషేధం విధించిందట. ఒక అగ్ర నిర్మాత తో సినిమా చేయడానికి అంగీకరించి అడ్వాన్స్ తీసుకున్న ఇలియానా షూటింగ్ కి హాజరు కాలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేరే హీరోయిన్ తీసుకొని ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. పోనీ అడ్వాన్స్ అన్న తిరిగి ఇచ్చిందా అంటే అది లేదట. దీంతో సదరు నిర్మాత కోలీవుడ్ ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాడు అని సమాచారం.

అలాగే టాలీవుడ్ లో కూడా ఆమెపై బ్యాన్ తీసుకురావాలని అతను తెలుగు నిర్మాతలను కూడా కోరాడట. అందుకే గత కొద్ది కాలంగా ఇలియానాకు ఎటువంటి సౌత్ ఇండియన్ మూవీ ఆఫర్స్ లేకుండా పోయాయి. ఇటీవల ఈ సమస్యను పరిష్కరించుకున్న ఇలియానా త్వరలోనే సౌత్ సినిమాలలో సందడి చేయనుంది.

ileana
#image_title

ప్రస్తుతం అనారోగ్య రీత్యా హాస్పిటల్ పాలైన ఇలియానా తన ట్రీట్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఒక్కరోజులో చాలా మార్పు వచ్చిందని డాక్టర్లు సెలైన్ పెట్టారని ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని అభిమానులకు తెలియపరచింది. మరోపక్క ఇలియానాకు కత్రినా కైఫ్ సోదరితో లవ్ ఎఫైర్ ఉంది అన్న పుకారు ఉంది. చాలా సందర్భాలలో సరదాగా గడుపుతూ వీరిద్దరూ కెమెరాకు చిక్కారు. కానీ ఇంకా వీరిద్దరి రిలేషన్ పై ఇలియానా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

Also Read: దిగ్బ్రాంతిలో టాలీవుడ్ స్టార్స్ తో పాటు రాజకీయ ప్రముఖులు..!

 

google news

Leave a Comment