అమ్మ నాన్నకి దూరం కావడానికి వాళ్లే కారణం.. విజయ చాముండేశ్వరి..

మహానటి సావిత్రి చనిపోయే ఇప్పటికి చాలా కాలం అయింది. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన విలక్షణమైన నటి చివరి క్షణాల్లో ఎంతో బాధ అనుభవించింది. నమ్మిన వారి ఆమెను మోసం చేయడంతో ఆస్తులు పోగొట్టుకుంది. రీసెంట్ గా కీర్తి సురేష్ హీరోయిన్ గా మహానటి చిత్రం సావిత్రి జీవితాన్ని అద్భుతంగా అందరికీ అర్థం అయ్యేలా వివరించి చెప్పింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి తన తల్లికి, తండ్రికి మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి అనే విషయంపై మాట్లాడారు.

అప్పటివరకు సావిత్రి కూతురు గురించి పెద్దగా తెలియని వాళ్ళకి కూడా విజయ చాముండేశ్వరి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు రకాల ఇంటర్వ్యూ లతో ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో సావిత్రి క్లాసిక్స్ పేరుతో ఆమె ఒక పుస్తకాన్ని రచించారు. ఇటీవల ఆ పుస్తకం ఆవిష్కరణ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రీ మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తిరిగి మళ్లీ తన తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవల గురించి మాట్లాడారు.

Savithri, Mahanati

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ చాముండేశ్వరి “అమ్మ ,నాన్న మధ్యలో కొన్ని విషయాల వల్ల మనస్పర్ధలు వచ్చాయి. అయితే అవి చాలా చిన్నవి.. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకుపోయేవి.. కానీ కొంతమంది అమ్మకు నాన్న గురించి చాలా నెగటివ్ గా చెప్పారు. ఆమెతో ఎక్కువగా ఉండేవారు అలా చెప్పడంతో ఆమె వాటిని నిజమని నమ్మింది. క్రమంగా అమ్మకి నాన్నకి దూరం పెరగడం మొదలయ్యింది. ఈ దూరంతో వాళ్లు బాగా లాభపడ్డారు.. కానీ వాళ్ల కారణంగా అమ్మ నాన్నకి దూరమైంది. “అని అన్నారు.

అంతేకాదు సావిత్రిని కలవడానికి జెమినీ గణేష్ గోడదూకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. తన తండ్రి ఇంట్లో ఉన్నంతవరకు తల్లి ఎంతో బాగుందని.. ఆయన ఇంటి నుంచి దూరంగా వెళ్లిన తర్వాతే ఆమె పరిస్థితుల్లో మార్పు వచ్చిందని విజయ చాముండేశ్వరి అన్నారు. భానుమతి సావిత్రి కి ఎంతగానో ఈ విషయంలో నచ్చజెప్పడానికి ప్రయత్నించారట.. అయినా సావిత్రి ఈ విషయంలో ఎవరి మాట వినలేదట. తల్లి చనిపోయిన తర్వాత తన తమ్ముడికి సంబంధించిన అన్ని వ్యవహారాలు తండ్రి దగ్గర ఉండి చూసుకున్నాడు అని విజయ్ చాముండేశ్వరి చెప్పారు.

 

google news

Leave a Comment