సంక్రాంతి బరిలో దిగుతాము అంటే ..చిన్న సినిమావి పోటీ తట్టుకోగలవా అని అన్నారు.. ఇంకొక డేటు చూసుకో అని ఇన్ డైరెక్ట్ గా సలహాలు ఇచ్చారు. అయినా సరే తమ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో టాప్ హీరోల సినిమాలను ఢీకొడుతూ సంక్రాంతి బరిలోకి దిగిన చిన్న చిత్రం హనుమాన్. చిన్న సినిమా అని అందరూ తేలికగా తీసుకున్న ఈ మూవీ ఊహించని విధంగా రికార్డుల ప్రభంజనం సృష్టించడంతోపాటు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

గత 21 రోజులలో ఈ చిత్రం హిందీ ,తెలుగు ,ఓవర్సీస్ ఇలా మొత్తం అన్ని రికార్డులను తుడిచి పెట్టేసింది. తెలుగులో అయితే ఏకంగా 92 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది. హాలిడేస్ ,వర్కింగ్ డేస్, ఫెస్టివల్స్ ఇలా వేటితో సంబంధం లేకుండా ఇరగదీసే కలెక్షన్స్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ సినిమాకి సుమారు 300 కోట్లు గ్రాస్ వసూళ్లు జరిగాయి. ఇలా 92 ఏళ్ల సంక్రాంతి విడుదల సినిమాలలో అత్యంత భారీ కలెక్షన్ సాధించిన మూవీగా హనుమాన్ కొత్త రికార్డును సృష్టించింది.

ఇండియాలో ఈ చిత్రం మూడు వారాల్లో 180 కోట్లు నికరంగా వసూలు చేసింది. విదేశాల్లో కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో సుమారు 59 కోట్లు అక్కడ వసూలు అయింది. ఇలా మొత్తానికి ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ , 150 కోట్ల నెట్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక క్వాలిటీ పరంగా తీసుకుంటే వందల కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా గ్రాఫిక్స్ తో పోల్చుకుంటే ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మ తీయబోయే నెక్స్ట్ సీక్వెల్ మూవీస్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
