రజినీకాంత్ కి కోపం వచ్చింది.. నోటీస్ ఇచ్చాడు..!

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెలినీ వారుండరు. భారత చిత్ర ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శం సూపర్ స్టార్ రజనీకాంత్. బస్సు కండక్టర్ నుండి గొప్ప స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి. ప్రతి ఒక్కరితో ఎలాంటి అహం లేకుండా కలిసిపోయే వ్యక్తికి చాలా కోపం వచ్చింది.

సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతున్నవి మీమ్స్. ఎక్కువమంది మీమర్స్ రాజకీయాలు, సినిమాలు, వార్తలు, చిన్న గల్లీ నుండి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన వేటిని వదలకుండా ఏవి దొరికితే వాటితో మీమ్స్ చేసి ఆదాయం పొందుతున్నారు. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ కి సంబంధం ఏముంది అనుకుంటున్నారా..!

సూపర్ స్టార్ రజనీకాంత్.. తన పేరును, ఆయన నటించిన సినిమాలలోని డైలాగులను, ఫోటోలను ఎటువంటి అనుమతి లేకుండా కమర్షియల్ గా వాడుకుంటున్నారని ఆయనికి తెలిసింది. దాంతో అయన అనుమతి లేకుండా ఎలా ఉపయోగిస్తారు అని కోపంతో అందరిపై కేసులు పెట్టమని లాయర్ ఎలంబరతి సుబ్బయ్యకి ఆదేశాలు ఇచ్చారని సమాచారం.

లాయర్ ఎలంబరతి సుబ్బయ్య వెంటనే ఒక ప్రైవేట్ నోటీస్ అరకొర కంపెనీ పేర్లతో బయటికి వదిలారు. ఇకపై ఎవరైనా పర్మిషన్ లేకుండా వాడుకుంటే ఆ సంస్థపై  లేదా ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం అని నోటీసులో ఉంది. మన టాలీవుడ్ లో కూడా కొంతమంది ఇలానే నోటీసులు పంపించారు. కానీ ఫలితం మాత్రం లేదు. ఇలా నోటీసులు పంపడం ద్వారా అభిమానులు సైతం బాధపడే అవకాశాలు ఎక్కువ.

google news

Leave a Comment