వేటికైనా హద్దు పద్దు లాంటివి ఉండాల్సిందే. లేకపోతే ఇలాంటి న్యూస్ లే ఎక్కువ అవుతాయి. సోషల్ మీడియాను ముంచెత్తుతాయి. అబద్దము అని తెలిసిన నమ్మసక్యం కాకున్నా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇంతకి అవి ఎలాంటి న్యూస్ అని మీరు అనుకుంటున్నారు. నేనైతే ప్రభాస్ ఎంగేజ్మెంట్ లాంటి న్యూస్ అని అనుకుంటున్నాను.

ఇక ప్రభాస్ ఆది పురుష్ టీజర్ రిలీజ్ రోజు నుండి మొదలైన ప్రభాస్, కృతి సనన్ లవ్, పెళ్లి రూమర్స్ రెండు మూడు రోజుల నుండి ముదిరి పాకాన పడినట్టు అయింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఎక్స్ట్రా ట్వీట్ చేసే ఓమర్ సంధూ కారణంగానే మాల్దీవ్స్ లో వీరి ఎంగేజ్మెంట్ అనే న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు అది నెట్టింట ట్రేడింగ్ అవుతుంది.

ఇక ఆ న్యూస్ రూమర్ అని తెలిసిన, అబద్ధం అని తెలిసినా కూడా ట్రెండింగ్ లిస్టులో కొనసాగడం డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ ని కూడా షాక్ చేస్తుంది. అంతేకాదు ప్రభాస్ పెళ్లి ముచ్చట తెలుసుకోవాలని ప్రభాస్ పెళ్లి త్వరగా అయితే చూడాలని ఆరాటం కొందరిలో కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. ఎంతైనా డార్లింగ్ కి అందరూ ఫ్యాన్సే కదా. ఇది ఇలా ఉండగా ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్, క్రితి సనన్ గురించి ఇంకెన్ని రూమర్స్ వస్తాయో వేచి చూడాలి మరి.
 
					 
		