ప్రభాస్ కల్కి లో తారక్…కథ మాములుగా లేదు గా..

మహానటి మూవీని అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కల్తీ మూవీతో ప్రేక్షకులం ముందుకు రాబోతున్నాడు .ప్రభాస్ ఓరేంజ్ సూపర్ హీరో లాగా కనిపించబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి .ఇప్పటికే ఈ చిత్రంలో భారీ తారాగణం ఉన్నట్లు అందరికీ తెలిసిందే. మరోపక్క విజయ్ దేవరకొండ.. దుల్కర్ సల్మాన్ కూడా ఈ మూవీలో కనిపిస్తారు అని టాక్ నడుస్తోంది. అయితే ఇంతవరకు దీని గురించి అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో కల్కి మూవీ నుంచి మరొక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి 2898 AD సినిమా లో ఇప్పటికే ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమలహాసన్ లాంటి స్టార్స్ ఉన్నారు.ఈ మూవీ భూత భవిష్యత్ కాలాల నేపథ్యంతో సాగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ బీభత్సం సృష్టించింది. త్వరలోనే ఈ మూవీ నుంచి టీజర్ ని కూడా విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లానింగ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి మరొక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలో నాచురల్ స్టార్ నానితోపాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు అని టాక్. మూవీ ఎండింగ్లో కృపాచార్య గెటప్ లో నాని కనిపించబోతుండగా ఏకంగా పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ దర్శనమిస్తారు అని తెలుస్తుంది. మొత్తానికి నాగ్ అశ్విన్..కల్కి మూవీకి సంబంధించి భారీ ప్లానింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్గా సలార్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

google news

Leave a Comment