కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో బిజీగా ఉన్న మహానటి. మలయాళ నటి మేనక, సినీ నిర్మాత సురేష్ కుమార్ ల రెండవ సంతానం అయినా కీర్తి సురేష్ 2015లో నేను శైలజ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అదే సమయంలో తమిళ తంబిలకు కూడా పరిచయమయ్యారు.
ఆ తర్వాత 2017లో నేను లోకల్ అంటూ లోకల్ జనాలకు మరింత చేరువయ్యారు. 2015 నుండి 2017 మధ్య తమిళ సినిమాలలో నటించిన అవి కూడా తెలుగులో వచ్చేసరికి ఇంకాస్త తెలుగులో గ్యాప్ ఇచ్చిన అనుభూతి ప్రేక్షకులకు కలగనివ్వలేదు. 2018వరకు కీర్తి సురేష్ సినీ జీవితం ఒకెత్తు అయితే 2018లో వచ్చిన మహానటి కీర్తి సురేష్ ని మరొక ఎత్తులో కూర్చోబెట్టింది.
సావిత్రి గారి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్.. సావిత్రి గారికి తగ్గట్టుగా శరీర తత్వాలను మార్చుకుంటూ ఆమె హావభావాలను ప్రదర్శిస్తూ మహానటి అనిపించుకుంది మలయాళ భామ.మహానటి తర్వాత తెలుగులో ఎన్ని సినిమాలు చేసిన అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన కీర్తి నటనకు మంచి మార్కులు పడుతూ అవకాశాలు చేజిక్కిచ్చుకుంటుంది.
ఇపుడు కీర్తి చేతిలో రెండు తెలుగు సినిమాలు, నాలుగు తమిళ సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇంత బిజీ లైఫ్ లో కీర్తి సురేష్ ప్రేమలో ఉందని అది మరెవరో కాదు తన చిన్ననాటి స్నేహితుడినే పెళ్లి చేసుకోబుతుంది అని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై కీర్తి సురేష్ నోరు విప్పలేదు. కానీ కీర్తి సురేష్ తల్లి అలనాటి నటి మేనక ఇది అంతా అబద్దం అని కుండ బద్దలుకొట్టింది.