తమన్నా.. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అంతే గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ. కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం చిత్రాల్లోనూ నటిస్తూ తానమేంటో నిరూపించుకుందీ తమన్నా. పరిశ్రమల సహనటీమణుల పోటీని తట్టుకుంటూనే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ని సెట్ చేసుకుందీ మిల్కీ బ్యూటీ. 13 ఏళ్ల వయసులో ‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిందీ సుందరి.
ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్‌లతో పాటు; తాజాగా ప్రేక్షకులను పలకరించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలా లిరికల్ వీడియో సాంగ్’తో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్‌లో టాప్‌లో నిలుస్తోంది. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది తమన్నా. ఈ సినిమాలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, సునీల్, మోహన్ లాల్, జాకీష్రాఫ్.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దీని కంటే ముందు నెల్సన్ రూపొందించిన బీస్ట్ చిత్రం కాస్త నిరాశపరచడంతో దర్శకుని ఆశలన్నీ ఈ చిత్రం పైనే పెట్టుకున్నారు.
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతోంది. కాబట్టి తనకు ఉన్న గ్లామరస్ హీరోయిన్ అనే చట్రం నుంచి బయటకు వచ్చి నటనలో తదుపరి స్థాయికి చేరుకోవడం కోసమే తాను పెట్టుకున్న ‘నో కిస్సింగ్’ రూల్‌ని బ్రేక్ చేసుకుందట తమన్నా. కారణం ఏదైనప్పటికీ స్క్రీన్ పై ఆమె నటించిన బోల్డ్స్ సీన్స్‌లో తమన్నా కాస్త శృతి మించి నటించిందనే అంటున్నారు చాలామంది. అయితే ఇందుకు వేరే కారణం కూడా ఉందని అంటున్నారు మరికొందరు.
మామూలుగా అయితే తమన్నా తీసుకునే పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల మధ్య ఉంటుందట. కానీ లస్ట్ స్టోరీస్ – 2 కోసం ఆమె తీసుకున్నది అక్షరాలా 7 కోట్ల రూపాయలట. శృంగారభరిత సన్నివేశాలలోనూ ఆమె నటించడానికి నిరాకరించరాదన్న కండిషన్‌తో అంత మొత్తం తీసుకుందని కూడా అక్కడక్కడా చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ‘భోళాశంకర్’ ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది.